Suryaa.co.in

Andhra Pradesh

మాన్సాస్ సిబ్బందికి జీతాలివ్వమంటే.. నాపై ఓ ఈవో కేసు పెట్టారు

– కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు
విశాఖ : ప్రభుత్వాలు అన్ని మతాలను గౌరవించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బు ఉండి కూడా సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. మాన్సాస్ సిబ్బందికి జీతాలివ్వమంటే తనపై ఓ ఈవో కేసు పెట్టారన్నారు. తాను కోర్టుకు వెళ్తే జీతాలు ఇవ్వమన్నారు..కానీ ఈవోపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. భూ అక్రమాలపై సర్వేలతో సహా ఇవ్వమని అడిగానని.. కానీ ఇవ్వలేదని చెప్పారు. తనపై ఓ సీక్రేట్ రీసెర్చ్ జరుగుతోందన్నారు.
వాహన మిత్ర కార్యక్రమానికి దేవాదాయ నిధులు వాడటమేంటని అశోక్‌గజపతి ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. 150కి పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. రామతీర్థం ఘటనపై యాక్షన్ తీసుకోకుండా రాజకీయం చేశారని మండిపడ్డారు. తాను కెమెరాలు పెట్టలేదని పదవి నుంచి తొలగించారన్నారు. దేవాలయాలు డబ్బులు ప్రభుత్వం తీసుకుని.. తనను పెట్టమంటే ఏం న్యాయమని ప్రశ్నించారు. కొందరు తనను జైలుకు పంపాలని చుస్తున్నారని అశోక్‌గజపతిరాజు అన్నారు.

LEAVE A RESPONSE