Suryaa.co.in

Telangana

అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యత:ఉప సభాపతి పద్మారావు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు చెందిన పండుగలకు సమాన ప్రాముఖ్యతను కల్పిస్తోందని ఉప సభాపతి పద్మారావు అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమాన్ని శనివారం సితాఫలమండీ లో పద్మారావు ప్రారంభించారు. ఈ సందర్భాంగా మాట్లాడుతూ తెలంగాణా సంస్కృతిని పరిరక్షించడంలో తాము పాటుపడతామని పద్మారావు అన్నారు. దసరా పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అయన ఆకాంక్షించారు.బతుకమ్మ ని ఖండాంతరాల్లో కూడా వ్యాపింప చేశామని పద్మారావు పేర్కొన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దాదాపు 60 వేల మందికి బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని, 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి మహిళకు రేషన్ కార్దు తో చీరను అందిస్తామని తెలిపారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, రాసురి సునీతా, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ శ్రీ పల్లె మోహన్ రెడ్డి, తెరాస కార్మిక విభాగం నేత మోతె శోభన్ రెడ్డి, తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, నేతలు కంది నారాయణ, లింగాని శ్రీనివాస్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE