-ఎవ్వడెవ్వడు ఎంత కొట్టేశాడో బయటకు తీస్తా
– మీకు నిద్ర లేకుండా చేస్తా
– రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు
విశాఖ : విశాఖ భూకబ్జాలు వ్యవహరంలో రెండు పార్టీ లు ఒక్కటే. సెక్షన్ 22 ఏ పేరుతో 30 వేల మంది కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రెండు పార్టీలు కుమ్మక్కై సిట్ బహిర్గతం చేయలేదు. ఈనెల 11 న సిట్ బహిర్గతం చేయాలని గవర్నర్ కు లేఖ రాశాను. నా లెటర్ కారణంగా 19న ప్రభుత్వం జీవో రిలీజ్ చేశారు. బిజెపి కారణంగా 22 ఏ భూములు వ్యవహరంలో కదలిక వచ్చింది.
ఐఏఎస్ లు , రాజకీయ నాయకులు ఒత్తిడి తో ఏమి చేసారో మీడియాలో చూసాము. సిట్ లో టిడిపి వైసీపీ నాయకులు బండారం బయట పడుతుందని బయట పెట్టడం లేదు. విశాఖలో ఇదే మా ప్రధాన ఎజెండా.ఎవ్వడెవ్వడు ఎంత కొట్టోసాడో బయటకు తీస్తా. మీకు నిద్ర లేకుండా చేస్తా. ప్రభుత్వం సిట్ బయట పెట్టి చర్యలు తీసుకోకపోతే మరో పోరాటం తప్పదు. వైపీసీ- టిడిపి భూములు పంచుకున్నారు.
వైసీపీ విశాఖకు ఏం చేశారు చర్చకు సిద్ధమా?
విశాఖ ను కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి చేసింది. విశాఖ రైల్వే స్టేషన్ కేంద్రం అభివృద్ధి చేస్తుంటే మీరు చేస్తుంది ఏంటి? ప్రధానిని విశాఖ కు రావాలని విశాఖ కు రావాలని అగస్టులో కోరాము. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు శంకుస్థాపన కు రావాలని కోరితే, దానికి కూడా వాళ్ళు స్టిక్కర్లు వేసుకుంటున్నారు. బీసీలకు వైసీపీ దగా చేస్తుంది. వైసీపీ – టిడిపి రెండు పార్టీలు బీసీలకు ద్రోహం చేస్తున్నారు. వైపీసీ టిడిపి కాపులకు అన్యాయం చేశాయి. మరల ఇప్పుడు వైసీపీ సమావేశం అంటుంది. అందరికీ సమాన అవకాశాలు బీజేపీ తోనే సాధ్యం.