– ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాల ద్వారా తగ్గిన కందిపప్పు ధరలు
– రాయితీ ధరలపై వంటనూనె అమ్మకానికి క్యూ ఆర్ కోడ్
– పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశం
అమరావతి: సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమయింది. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధర ల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది.
ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాలు…ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాల ద్వారా తగ్గిన కందిపప్పు ధరలు కేంద్రం దిగుమతి సుంకం పెంపుతో వంటనూనె ధరలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. పెరిగిన వంటనూనె ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
ప్రత్యేక కౌంటర్ల ద్వారా లీటర్ పామాయిల్ రూ.110 అమ్ముతున్న ప్రభుత్వం దిగుమతి దారులు, హోల్ సేల్ నిర్వాహకులు, రిటైల్ దారులతో ప్రభుత్వం చర్చలు జరిపి.. అనంతరం రాయితీ ధరలపై వంటనూనెను అమ్మకానికి క్యూ ఆర్ కోడ్ ద్వారా అమ్మకాలు నిర్వహిస్తున్నారని తెలిపింది.
అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కందిపప్పు పంచదారను సబ్సిడీ ధరలకు సప్లై చేయడం జరుగుతుందని మంత్రులు తెలిపారు. కందిపప్పు కేజీ 67 రూపాయలు, పంచదార అర్థ కేజీ 16 రూపాయలు, పామాయిల్ లీటర్ 110 రూపాయలకు రైతు బజార్ తో పాటు రాష్ట్రంలోని 2200 రిటైల్ అవుట్ల ద్వారా సబ్సిడీ ధరలకు అమ్మకం జరుపుతోందన్నారు.