ప్రముఖ సంస్కర్త , కవి కాళ్లకూరి నారాయణరావుఋ రచించిన చింతామణి నాటకాన్ని కాపాడుకోవడానికి శ్రీకాకుళంలో పరిరక్షణ సమితి ఏర్పాటయింది. కవీ,జర్నలిస్టు నల్లి ధర్మారావు కన్వీనర్ గా, న్యాయవాది బొడ్డేపల్లి మోహన రావు, రంగస్థల ప్రతినిధి చిట్టి వెంకటరావు కో కన్వీనర్లుగా ఎంపికయారు.
స్థానిక క్రాంతి భవన్ లో ఉదయం జరిగిన కవులు,రచయితలు, కళాకారుల సమావేశం ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది . సంఘ సంస్కర్తగా కాళ్లకూరి రాసిన చింతామణి నాటకానికి శత వసంతాల ఉత్సవాలు కూడా జరిగాయని నల్లి ధర్మారావు గుర్తు చేశారు.
లీలాశుక యోగి జీవిత చరిత్ర ఆధారంగా,వేశ్యా వృత్తికి వ్యతిరేకంగా కాళ్లకూరి రాసిన నాటకం చింతామణి అని చెప్పారు. దీనిలో సుబ్బిశెట్టి అనే పాత్ర ఆర్య వైశ్యుడిది కావడం వల్ల, మొత్తం నాటకాన్నే నిషేధించడం ప్రభుత్వం వల్ల కళారంగానికి కలిగిన విషాదమాన్నారు.
సాహిత్యాన్ని , కళలను నిషేదించడం గొప్ప నియంతలకే సాధ్యం కాదన్నారు. నిషేధం ఎత్తివేత కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామనీ, లీగల్ ప్రయత్నం కూడా చేస్తామన్నారు.