Home » విద్యాసంస్థలకు సెలవులు ఇస్తే ముఖ్యమంత్రికి వచ్చిన నష్టమేంటి?

విద్యాసంస్థలకు సెలవులు ఇస్తే ముఖ్యమంత్రికి వచ్చిన నష్టమేంటి?

-విద్యార్థులకు వ్యాక్సిన్ అందుబాటులో లేదని తెలిసీ, ఈ ప్రభుత్వం వారిజీవితాలతో చెలగాటమాడుతోంది -30 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాల్సిందే
• జనవరి 1 నాటికి రాష్ట్రంలో రోజుకి సగటున 200వరకు కేసులు నమోదైతే, ఇప్పుడు 7వేలు నమోదవుతున్నాయి. 1వతేదీన పాజిటివిటీరేటు 0.57శాతం ఉంటే, ఇప్పుడు 20శాతానికి చేరింది.
• అమ్మఒడి పొందాలంటే 75శాతం హాజరు తప్పనిసరి అన్న నిబందనను ప్రభుత్వం ఇప్పుడు తొలగించాలి.
• ఉపాధ్యాయులకు వ్యాక్సిన్లు వేస్తే, విద్యార్థులకు కరోనారాదని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటు.
• రాష్ట్రంలో అనేక విద్యాసంస్థల్లో ఒకేగదిలో 70, 80 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారు.
• కరోనా టెస్ట్ లు చేసే సిబ్బంది, ఇతరవైద్యసిబ్బందికి ప్రభుత్వం 300కోట్లు బకాయి పడింది. దానిపర్యవసానమే రాష్ట్రంలో లక్షవరకు సామర్థ్యమున్న కరోనా టెస్ట్ లు, 20, 30వేలకు పరిమితమయ్యాయి
-టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా జగన్ రెడ్డి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించకుండా చిన్నారులజీవితాలతో చెలగాటమాడుతున్నాడని, ఏపీలో రమారమి రోజుకు 7వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నా, టెస్ట్ ల సంఖ్యను పెంచకుండా ప్రభుత్వం కాలయాపనచేస్తోంద ని, రోజుకి లక్షవరకుటెస్ట్ లు చేసే సామర్థ్యం ఉన్నా, 20, 30వేల టెస్ట్ లకే ప్రభుత్వం పరిమిత మైందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు.బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

ఈ నెల ఒకటినాటికి రాష్ట్రంలో సగటున 200 కేసులు నమోదైతే, ఇప్పుడు ఆసంఖ్య 7వేలకు చేరువైన పరిస్థితి. ఎంత వేగంగా కరోనా వ్యాప్తి చెందుతుందో కేసుల పెరుగదలే చెబుతోంది. జనవరి 1నాటికి రాష్ట్రంలో పాజిటివిటీరేటు 0.57శాతం ఉంటే, ఇప్పుడు 20శాతం ఉంది. కరోనా నిర్ధారణ పరీక్షలు (టెస్ట్ లు) తక్కువ చేస్తున్నా కరోనావ్యాప్తి నానాటికీ అధికమవు తోంది. 1 నుంచి 15ఏళ్ల పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. వారు నిరంతరం మాస్క్ లు పెట్టుకునే పరిస్థితిఉండదు. 15ఏళ్లలోపు పిల్లలు మాస్క్ లు పెట్టుకుంటే, వారికి ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరగదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇవేవీ ఆలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

విద్యాశాఖమంత్రి కరోనా పెరుగుదలకు, విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడానికి సంబంధం ఏమిటంటున్నారు. తుగ్లక్ రెడ్డి చెప్పింది చేయడంతప్ప మెదడుతో ఆలోచన చేసి విద్యాశాఖమంత్రి మాట్లాడటంలేదు. ప్రతిదానికీ తెలంగాణతో పోల్చుకునే ఏపీప్రభుత్వం, ఆ రాష్ట్రం విద్యాసంస్థలకు 30వరకు సెలవులు ప్రకటిస్తే, ఈ రాష్ట్రంలోఎందుకు ప్రకటించదు? ఒక 10రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఇస్తే, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందే మిటి? ఏం కొంపమునుగుతుంది? సెలవులు ఇచ్చి, ఆన్ లైన్ క్లాసులు నిర్వహించకూడదా? ఆన్ లైన్ క్లాసులు సాధ్యపడకపోతే, తరువాత రోజుల్లో సిలబస్ బోధనచేయకూడదా? కరోనా నిర్ధారణ టెస్ట్ ల సంఖ్య కేవలం 20, 30వేలకు పరిమితమవడానికి కారణం సిబ్బంది లేకపో వడమే. కరోనా తొలి, రెండోదశలో పనిచేసినవారికి ఈ ముఖ్యమంత్రి జీతాలు ఇవ్వలేదు. దాని ఫలితమే ఇప్పుడు కరోనా మూడోదశ ఉధృతమవుతున్నా, రాష్ట్రంలో పనిచేయడానికి ఎవరూ ముందుకురావడంలేదు. ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సిన్లు వేశామని చెబుతున్న ప్రభుత్వం, విద్యార్థుల జీవితాల గురించి ఎందుకు పట్టించుకోదు? చాలాప్రాంతాల్లో 70 నుంచి 80మంది విద్యా ర్థులు ఒకే తరగతిగదిలో కూర్చుంటున్నారు.

సంక్రాంతి సెలవుల తర్వాత 35శాతం విద్యార్థులుకూడా తిరిగి పాఠశాలలకు హాజరుకావడంలేదంటే, తల్లిదండ్రులు ఎంతగా భయపడుతున్నారో అర్థంకావడంలేదా? తల్లిదండ్రుల ఆందోళన ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి పట్టదా? అదేమంటే అమ్మఒడి ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటారు. అది ఎలా అమలవుతోందో..ఎన్ని నిబంధనలు పెడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా సమయంలో కూడా అమ్మఒడి పొందాలంటే 75శాతం హాజరుతప్పనిసరి అనే నిబంధన అమలుచేయడం ప్రభుత్వానికి తగదు. పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోయినా కూడా ముఖ్యమంత్రి, వారిప్రాణాల గురించి పట్టించుకోడు. ముఖ్యమంత్రి ఏంచెప్పినా మామూలుగా చెబితేవినడు.ఏం కావాలన్నా…ఏం చేయాలన్నా కోర్టులు చెబితే నే చేస్తాడు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ లోకేశ్ గారు ఈ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆయన లేఖరాశాడు కాబట్టి, ఈప్రబుద్ధుడు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నాడా? అలాంటి ఆలోచనలు చేయడం తుగ్లక్ చర్య కాక ఏమవుతుంది? ఈ నెల 30వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులను గుంపులు, గుంపులుగా కుక్కేసి మరీ విద్యాబోధన చేస్తున్నారు. ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తే తప్ప, విద్యార్థులకు రక్షణలేదని స్పష్టంచేస్తున్నాం.

ఏపీ ప్రభుత్వతీరుపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు ప్రభుత్వప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సమన్లు పంపింది. కరోనాతో చనిపోయిన వారికి కనీసం రూ.50వేల పరిహారం ఇవ్వాలని గతంలో న్యాయస్థానం తీర్పుచెప్పింది. దానిపై ఏపీప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, దేశ అత్యున్నతన్యాయస్థానం రాష్ట్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఏంచేస్తారో, కోర్టుకు ఏంచెబుతారో చూడాలి.

ఏపీలో ఇప్పటికీ రెండోడోస్ వ్యాక్సిన్ వేయించుకోని వారు చాలామంది ఉన్నారు. రాష్ట్రప్రభుత్వానికి గుండెకాయ వంటి సచివాలయంలోనే కరోనా వ్యాక్సిన్ లేదని చెబుతున్నారు. అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా ఈ ప్రభుత్వానికి? సచివాలయంలో సరైన శానిటైజేషన్ చర్యలేలేవని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న కోవిడ్ సమాచారమంతా తప్పులతడకే. నేను 24ఏప్రియల్ 2021లో రెండోడోస్ వ్యాక్సిన్ వేయించుకుంటే, 11-11-2021 న వేయించుకున్నట్లు నాఫోన్ కి మెసే జ్ వచ్చింది. అదిచూస్తేనే అర్థమవుతోంది .. ఈప్రభుత్వం ఇస్తున్న సమాచారం ఎంత పారద ర్శకమైనదో. డ్వాక్రామహిళలు, ఇతరత్రా సిబ్బందికి మాస్క్ లను రూ.20కు అమ్ముతున్నార నే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటివి లేకుండా కరోనావ్యాప్తి విషయంలో ప్రభుత్వం పకడ్బందీగా, ముందుచూపుతో వ్యవహరించాలని కోరుతున్నాం. డెల్టా, ఒమిక్రాన్ వేరని, దేని వ్యాప్తి దానిదే అని ఆరోగ్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తన అలసత్వాన్ని, నిర్లక్షాన్నివీడి, వెంటనే రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించా లని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి తనమత్తు వదిలించుకోకపోతే, జరగాల్సిన నష్టం జరుగుతుంది. కేంద్రప్రభుత్వం, రాష్ట్రాలకే స్వయం నిర్ణయాధికారం ప్రకటిస్తే, ఈ ప్రభుత్వం కేంద్రంపై నిందలేస్తూ, ప్రజలు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది.

Leave a Reply