దొంగే దొంగదొంగ అన్నట్టుగా ముఖ్యమంత్రిగా ఉన్న గజదొంగ వైఖరి ఉంది

– జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రజాకంటక నిర్ణయాలు ప్రశ్నిస్తున్నందుకే ఆయనకళ్లకు తాము రాక్షసుల్లా కనిపిస్తున్నామా?
– జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసినందుకు జనం నిత్యం ఏడుస్తూనే ఉన్నారు వారి ఏడుపుకి సమాాధానంచెప్పలేక ఆయన ప్రతిపక్షంపై పడి ఏడుస్తున్నాడు
• మద్యందోపిడీ.. ఇసుకకుంభకోణం…భూకబ్జాలు… ఖనిజసంపదలూఠీ.. లాంటి పదితలలతో పాలనచేస్తున్న కలియుగ రావణాసురుడు జగన్ రెడ్డి.
• ఉద్యోగులు రోడ్డెక్కినా.. అంగన్ వాడీలు, ఆశావర్కర్లు కన్నీరుపెట్టుకున్నా.. మహిళలపై అత్యాచారాలు జరిగినా.. పోలవరం పనులు ఆగిపోయినా.. రాజధాని నాశనమైనా అన్నింటికీ చంద్రబాబునాయుడే కారణమా?
• జగన్ రెడ్డి నరంలేనినాలుక ఏంచెప్పిన ప్రజలు నమ్ముతారులే అనుకుంటోంది..
• ఆయన అవినీతి, దోపిడీ, అబద్ధాలు.. తనవారికి దోచిపెట్టే నైజంతో ఏపీకూడా శ్రీలంకలా చిన్నాభిన్నమై సముద్రగర్భంలో కలిసిపోవడంఖాయం.
– మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్

ముఖ్యమంత్రిస్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నిన్నమాట్లాడిందివింటే, ఆయనలో తీవ్రమైన నిరాశానిస్పృహలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని, ఆయనేదో అద్భుతాలు చేస్తుంటే, ఆయనపై పడి ప్రతిపక్షాలు ఏడుస్తున్నట్లు నంగినంగిగా మాట్లాడుతూ, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఎద్దేవాచేశారు.శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …

ప్రతిపక్షంలోఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిఏంచెప్పాడో, ముఖ్యమంత్రి అయ్యాక ఏంచేస్తున్నా డో చూశాకప్రజలతోపాటు, ఉద్యోగులుకూడా ఆయన అద్భుతాలు చేస్తున్నాడనే భావిస్తున్నా రు. వారంలో సీపీఎస్ రద్దుచేస్తాననిచెప్పిన జగన్ రెడ్డి, మూడేళ్లైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం నిజంగా అద్భుతమే. అందుకని టీడీపీ ఏడవాలా? ఉద్యోగుల్ని పావులుగా వాడుకొని, వారికి అన్నీచేస్తానని కల్లబొల్లిమాటలు చెప్పిన జగన్ రెడ్డి, ముఖ్య మంత్రి అయ్యాక గతంలో ఇంటెరిమ్ రిలీఫ్ కింద ఉన్న 27శాతం పీఆర్సీని తగ్గించిన ఘన చరిత్ర ఈ ముఖ్యమంత్రిదే.

ఉద్యోగులైతే తాము కుడిచేత్తో, ఎడంచేత్తో జగన్ రెడ్డికి ఓట్లేశామని చెప్పారో వారేరోడ్లపైకి వచ్చిఏడుస్తున్నారుగానీ, తమకు ఆ అవసరంలేదు. ఈ ముఖ్యమంత్రి ప్రజలకు రాష్ట్రానికి ఏంచేశాడని బాధ్యతాయుతమైన ప్రతిపక్షస్థానంలో ఉన్న టీడీపీ ఏడవాలో ఆయనేచెప్పాలి.ఎవరూ డిమాండ్ చేయకుండానే ప్రజలకష్టాలు, వారిబాధలు తీరుస్తున్నాడని ఏడవాలా? లేక పోలవరానికి కుప్పలుకుప్పలు నిధులుతెచ్చి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేశాడని టీడీపీ ఆయనపైపడి ఏడవాలా? రాజధాని అమరావతిని నామరూపాలు లేకుండా చేసిన జగన్ రెడ్డి పనితనంచూసి ఏడవాలా? 23మంది ఎంపీలను చేతిలో ఉంచుకొని కేంద్రంనుంచి పోలవరం నిర్మాణానికి నిధులు తేలేని ముఖ్యమంత్రి అసమర్థతచూసి ఏడవాలా?

తన సొంతనియోజక వర్గంలో ఏర్పాటుచేస్తానన్న కడపస్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేసినందుకు ఏడవాలా? తాము ఏడవడంకాదు… ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినందుకు రోజూ ఏడుస్తూనే ఉన్నారు. 5ఏళ్లపాటు టీడీపీప్రభుత్వం రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచలేదు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను కోతలులేకుండా అందించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 7సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచి, విపరీతమైనభారం ప్రజలపై వేసింది వాస్తవమా..కాదా?

ఏపీఈఆర్సీ ఛైర్మన్ గా ఉన్న వ్యక్తి విధిలేక విద్యుత్ ఛార్జీ లు పెంచినట్లు మొసలి కన్నీరు కారుస్తూ మాట్లాడారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను తనకుకావాల్సిన కంపెనీలకు కట్టబెట్టడం కోసం, ఈ ముఖ్యమంత్రి గతప్రభుత్వంచేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసింది నిజంకాదా? ముఖ్యమంత్రి విద్యుత్ రంగానికి సంబంధిం చి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే నేడురాష్ట్రం చీకట్లలో మగ్గిపోవడానికి కారణంకాదా? అదానీతో ఈప్రభుత్వంచేసుకున్ననిర్ణయాలే రాష్ట్రవిద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశాయని స్వయంగా అధికారులే చెప్పినమాట వాస్తవంకాదా?

జగన్మోహన్ రెడ్డి తనదోపిడీ, అవినీతి కోసం విద్యుత్ రంగాన్నానాశనంచేస్తే ఆభారం ప్రజలు భరించాలా? టీడీపీ 5ఏళ్లపాలనలో పరిశ్రమలకు ఒక్కరోజైనా పవర్ హాలిడే ప్రకటించామా? విద్యుత్ రంగాన్ని బలోపేతంచేసి, మిగులువిద్యుత్ తో రాష్ట్రాన్ని జగన్ రెడ్డికి అప్పగిస్తే, ఆరంగంతోపాటు,మొత్తంగా రాష్ట్రాన్నే నాశనంచేసిన జగన్ రెడ్డిని చూసి ఏడవక ఏంచేయాలని ప్రశ్నిస్తున్నాం.

ఇక రోడ్డు విషయానికి వస్తే ప్రజలప్రాణాలుపోతున్నా రోడ్లువేయని ఈ ప్రభుత్వాన్నిచూసి ప్రజలు ఏడవాలా..లేక మేంఏడవాలా? టీడీపీవారంతా రాక్షసులు.. మారీచులు.. దుర్మార్గులు అన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడాడు. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు, అవినీతిపరుడు, దోపిడీదారుడికి అందరూ అలానేకనిపించినట్లు టీడీపీవారు ఆయనకురాక్షసుల్లా కనిపిస్తున్నారు. జగనాసురుడు అనే రాక్షసుడిదెబ్బకు రాష్ట్ర ప్రజానీకమంతా చిగురుటాకులా వణికిపోతున్నది వాస్తవం కాదా?

ముఖ్యమంత్రి ఏంచేసినా ఆయన మంత్రుల్లా తాముకూడా భజనచేయాలా? ప్రతిపక్షం బాధ్యతేమిటో ముఖ్యమంత్రికి తెలియదా.. ఆ బాధ్యతప్రకారం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రజాకంటక నిర్ణయాలను తాము ప్రశ్నించకూడదా? ప్రతిపక్షపార్టీగా ప్రభుత్వవైఫల్యాలు, ముఖ్యమంత్రి మంత్రుల దోపిడీని, అవినీతిని ప్రశ్నించడం తమపని. ఆ పనిచేస్తున్నందునే తమను రాక్షసులని ముఖ్యమంత్రి అంటున్నాడా?ప్రత్యేక హోదా రావాలంటే మోదీ కాలర్ పట్టుకోవడం ఒక్కటే మార్గమని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్, ఇప్పుడెందుకు ఆపనిచేయడం లేదు?

ప్రజలంతా నిజంగానే జగన్ రెడ్డి మోదీకాలర్ పట్టుకొని ప్రత్యేకహోదా తెస్తాడని 23మందిఎంపీలను ఇస్తే, ఈ ముఖ్యమంత్రి తనవ్యక్తిగతప్రయోజనాలకోసం హోదాను, రాష్ట్రాన్ని తాకట్టుపెట్టింది వాస్తవమా ..కాదా. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మోదీని కలవగానే కడపలో సీబీఐ అధికారులుఉంటున్న గెస్ట్ హౌస్ లను కూడా ఖాళీచేయించి, వారినిబయటకుపంపారు. అంతలా ముఖ్యమంత్రి మోదీతో మంతనాలుజరిపారని ఇక్కడే అర్థమవుతోంది.

జగన్మోహన్ రెడ్డికి ప్రజల కన్నీళ్లు, వారికష్టాలు అసలుకనిపించవని రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తేనేఅర్థమవుతోంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ఉత్పత్తులు అమ్మడానికి కూడా అవకాశంలేకుండా పోయింది. ధాన్యంరైతులు వడ్లను తక్కుధరకు అమ్ముకోవడం ద్వారా ఎకరాకు రూ.10నుంచి రూ.15వేలవరకు నష్టపోయినమాట వాస్తవంకాదా? పంటఉత్పత్తులు పండించి కూడా వాటిని అమ్ముకోలేని రైతులధైన్యం ఈముఖ్యమంత్రికి ఎప్పుడైనా కనిపించిందా? మరీముఖ్యంగా మిరపరైతుల కష్టాలు మాటల్లోచెప్పలేము. నల్లి తెగులువచ్చి, నడిసముద్రంలో చిక్కుకున్నవారిలా మిరపరైతులు నానాఅగచాట్లు పడుతు న్నాకూడా ముఖ్యమంత్రి వారికి రూపాయికూడా ఆర్థికసాయం చేయలేదు.

డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అని ప్రజలకు ఏదో సాయంచేస్తున్నటు ముఖ్యమంత్రి డీబీఎస్ స్కీమ్ అంటున్నాడు. డైరెక్ట్ గా ప్రజలను దోచుకుంటూ, వారికి నిలువనీడలేకుండా చేస్తున్నది ఈముఖ్యమంత్రి, ప్రభుత్వంకాదా? సెంటుస్థలాలపంపిణీలో భూమిధరలు పెంచేసి, వైసీపీప్రజా ప్రతినిధులు వేలకోట్లు కాజేసింది వాస్తవమా..కాదా? సెంటుపట్టా స్థలాలపంపిణీలోనే చాలా మంది అధికారపార్టీఎమ్మెల్యేలు వారి ఎన్నికలఖర్చుకు సరిపడా సొమ్ముని కాజేశారని చెప్పుకుంటున్నారు.

సెంటుపట్టాల పంపిణీతోపాటు, పేదలకు ఇచ్చామనిచెప్పుకుంటున్న భూమిని చదునుచేసే నెపంతో మరోకొత్తతరహా అవినీతికి కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్పడ్డారు. ఇలాంటి అనేక అవినీతిచర్యలను, ముఖ్యమంత్రి మొదలు కిందిస్థాయి వాలంటీ ర్ వరకు చేస్తున్న దోపిడీని తాముప్రజలపక్షాన ప్రశ్నిస్తున్నామనే, జగన్మోహన్ రెడ్డికి మేం మారీచుల్లా కనిపిస్తున్నాము. నేరాలుఘోరాల్లో 12వస్థానంలో ఉన్న రాష్ట్రం 6వస్థానంలోకి వచ్చింది.

అదీ ఈ ముఖ్యమంత్రి ఈ మూడేళ్లలో సాధించిన గొప్పప్రగతి. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులేమో మహిళలకు ఏదైనా అన్యాయంజరిగితే, గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పారు. గన్ లేదు.. బుల్లెట్ లేదు….రోజూ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగు తున్నా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏనాడూ పట్టించుకున్నదిలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ మూడేళ్లలో ఆడబిడ్డలు, చిన్నారులపై 1500లకు పైగా అఘాయిత్యాలు జరిగితే , వాటికి కారకులైనవారిలోఈ జగన్ రెడ్డి కనీసం 15మందిని కూడా శిక్షించలేకపోయాడు.

జగన్ రెడ్డి ఆ బాబూ..ఈ బాబూ హైదరాబాద్ లో ఉండి రాజకీయాలుచేస్తున్నారు అని కొత్త డైలాగ్ ఒకటివేశారు. మరి జగన్ బాబుఎన్నికలకు ముందు ఎక్కడున్నాడో ఆయనకుతెలి యదా? ప్రజలకు తెలియదా? ఈ జగన్ బాబు హైదరాబాద్ లోఉండి కుట్రరాజకీయాలు చేసి, ఆఖరికి ఏపీ పోలీసుల్ని తానునమ్మను అన్నది వాస్తవంకాదా?
నిన్నటివరకు దేవాలయాలు, విగ్రహాలవిధ్వంసానికి పాల్పడిన జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం చివరకు హిందువులు పరమపవిత్రంగా భావించే ఆలయాల్లో మాంసం వండించేవరకు వచ్చింది. పెదకాకాని శివాలయంలో మాంసం వండిన ఘటనలో ఈ ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకుంటోందోచెప్పాలి.

విద్యారంగం రూపురేఖలు మార్చడమంటే పాఠశాలలకు పార్టీ రంగులేయడమా?
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏ వ్యవస్థ అయినా సక్రమంగా పనిచేస్తోందా ? పేదపిల్లలు విదేశాల్లో చదువుకునే అవకాశం ఈ ప్రభుత్వంకల్పిస్తోందా? ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయనతాబేదారులు వారిపిల్లలే ఉన్నత చదువులు చదువుకోవాలా…. పేదల పిల్లలు ఎవరూ విదేశాలకు వెళ్లి ఉన్నతచదువులు చదవకూడదా? దళితవిద్యార్థులకు పనికొచ్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ఈ ముఖ్యమంత్రి ఎందుకు రద్దు చేశాడు.

కుటుంబంలో ఒకరికి అమ్మఒడిఇస్తే, అదేకుటుంబంలో ఉన్నతచదువులుచదివే విద్యార్థులుంటే వారికి స్కాలర్ షిప్ లు ఇవ్వనని ఎందుకు చెబుతున్నాడు? విద్యారంగం రూపురేఖలుమార్చామని డబ్బాలుకొట్టుకుంటున్న ముఖ్యమంత్రి, పాఠశాలలు, ప్రభుత్వకార్యాలయాలకు తనపార్టీరంగులేయడం తప్ప ఈమూడేళ్లలో ఏంమార్చాడో సమాధానంచెప్పగలడా? ఆఖరికి ఉపాధ్యాయులను తీసుకెళ్లి మద్యందుకాణాలవద్ద కాపలాపెట్టి.. వారితో మద్యం అమ్మించాడు. అదీ ఈముఖ్యమంత్రి విద్యార్థులకు, విద్యారంగానికి చేసిన గొప్పసేవ.

తాను చెప్పింది చేయకపోతే తనను ద్వేషించండి అని ముఖ్యమంత్రి అంటున్నాడు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగతకక్షతో, వ్యక్తులను లక్ష్యంగాచేసుకొని, వారినినాశనంచేసే క్రమంలో వ్యవస్థలను నాశనంచేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. వ్యక్తిగతంగా ప్రజలను, ప్రతిపక్షనేతలను ఇబ్బంది పెట్టడంతప్ప, జగన్ రెడ్డి ఈమూడేళ్లలో ఏంచేశాడో చెప్పాలి. జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, దానిలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. దోపిడీచేయకపోయినా… ప్రజలకు అబద్ధాలుచెప్పకపోయినా ఈముఖ్యమంత్రి తల వెయ్యి ముక్కలవుతుందనే శాపంఉంది. ఆశాపంప్రకారమే జగన్మోహన్ రెడ్డి బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ ను రావణరాజ్యమైన శ్రీలంకలా మార్చేశాడు.

పది అవినీతి తలల రావణడు జగనాసురుడు అనే రాక్షసుడి దెబ్బకు ఈ రాష్ట్రం, 5కోట్లమంది ప్రజలకూడా ఏదోఒకరోజు శ్రీలంకమాదిరే చిన్నాభిన్నమై, సముద్రగర్భంలో కలిసిపోవడం ఖాయం. రాజకీయం.. వ్యాపారం….కాంట్రాక్ట్ లు.. ఏంచేసినా, ముఖ్యమంత్రి, ఆయనపార్టీవారు.. ఆయనకకులంవారే చేయాలి. వేరేవాళ్లు ఎవరైనా చేయడానికి ముందుకొచ్చినా, గతప్రభుత్వంలో పనులు చేశాము.. బిల్లులు ఇవ్వండని మొత్తుకున్నా.. వారికి మిగిలేది చెరసాలే. అదీ జగన్ రెడ్డి. ఆయనప్రభుత్వమంటే. రాష్ట్రంలోని పోర్టులు, విమానాశ్రయాలు, విశాఖ స్టీల్ ప్లాంట్, నెల్లూరు కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ కానీ అన్నీ ప్రైవేట్ వారికే ..అదీ కూడా జగన్ రెడ్డి తనవారికే అప్పగిస్తున్నాడు.

ప్రజల్లో తనపై తీవ్రమైనవ్యతిరేక తఉందని తెలిసే , తన వైఫల్యాలను, పాలనాలోపాలను కప్పిపుచ్చుకోవడానికు జగన్ రెడ్డి ప్రతిపక్షాలు, కొన్నిమీడియాసంస్థలను రాక్షసులని చెబుతూ, తనకు తాను దైవాంశసంభూతడని బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మొదలు, కిందిస్థాయిలో ఉండేఅటెండర్ వరకు అందరికీ తెలిసిందేమిటంటే చంద్రబాబుని దూషించడం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే, రాష్ట్రంలో జరిగే దారుణాలకు, ప్రజలుపడుతున్న ఇబ్బందులు, కష్టాలకు చంద్రబాబు ఎలా కారకుడు అవుతాడు?

ఒకపథకంలో తప్పులు జరిగితే, ఆ తప్పుచేసిన వారు ఎవరో గుర్తించి, వారిని శిక్షించాలిగానీ, ఏకంగా పథకాలనే రద్దు చేయడమేంటి? ఆవగింజంత అవినీతి ఉంటే, ప్రజలకు అన్నంపెట్టే పథకాల అన్నింటినీ రద్దు చేస్తారా? ఈ ముఖ్యమంత్రి తెలివితేటలు అలా ఉన్నాయి మరి. ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తున్నది ఏమిటంటే దొంగే ఎదుటివారిని పట్టుకొని దొంగదొంగ అనడం. దోపిడీదారులు…అవినీతిపరులు.. కబ్జాకోరులు.. రాక్షసులు… టెర్రరిస్ట్ లే ప్రభుత్వంలో ఉన్నారు. వారి కళ్లకు ఎదుటివారు కూడా అలానే కనిపిస్తుంటారు.

Leave a Reply