-నాసిరకం నాయకులను ఎన్నుకుంటే నాసిరకం పనులే చేస్తారు
-నీటి పాలైన రోడ్డును పరిశీలించిన సీపీఐ బృందం
చెన్నై బళ్లారి జాతీయ రహదారి కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై అప్రోచ్ రోడ్డుకోసం వెచ్చించిన డబ్బులు కాంట్రాక్ట్ పాలు రోడ్డు నీళ్ల పాలయాయ్యాయనీ వెంటనే నాణ్యమైన రహదారి నిర్మించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ( సీపీఐ )జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య కోరారు శుక్రవారం జాతీయ రహదారి పాపాగ్ని నది పై నిర్మించిన అప్రోచ్ రోడ్డును సీపీఐ బృందం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ బళ్లారి చెన్నై జాతీయ రహదారిలో కమలాపురం వద్ద పాపాగ్ని వంతెన కింద ఇసుక తవ్వకపోవడంతో గత సంవత్సరం కురిసిన పెద్దపెద్ద వానలకు వరద పోటెత్తి వంతెన కూలిపోయిందని దీంతో రాకపోకలకు అంతరాయం కలిగి కమలాపురం నుండి కాజీపేట చెన్నూరు మీదుగా కడపకు వచ్చేవారని దూరంతోపాటు భారీ వాహనాలకు తీవ్రమైన ఇబ్బంది కలిగేదని అందుకు 6 కోట్ల 32 లక్షల వ్యయంతో అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు అయితే అర కిలోమీటర్లు అప్రోచ్ రోడ్డుకు ఆరు కోట్లు వెచ్చించి నిర్మిస్తే ఆరు నెలలు కూడా గడవకముందే చిన్నపాటి వానలకు నీటి వేగానికి నాసిరకం రోడ్డు తెగిపోయి నీళ్ల పాలు అయిందని ఆవేదం వ్యక్తం చేశారు.
అప్రోచ్ రోడ్డు ఆరు కోట్ల 32 లక్షలు లో దాదాపు 60 శాతం నిధులు కాంట్రాక్టులు, ప్రజాప్రతినిధులు, అధికారులు జేబులోకి పోయాయని కేవలం 40 శాతం లెక్కతో నాసిరక పనులు చేసి నాణ్యత గట్టిదనం లేని రోడ్డు వేయడం వలన ఈరోజు అవి చిన్నపాటి నీటి వేగానికి కొట్టుకుపోయాయని కాంట్రాక్టులకు కక్కుర్తి పడి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని వారు కోరారు.
కాంట్రాక్టులు, వ్యాపారం, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేసే నాసిరకం నాయకులను ఎన్నుకుంటే నిర్మాణాలు, అభివృద్ధి నాసిరకంగానే ఉంటాయని అందుకు ఉదాహరణ అప్రోచ్రో రోడ్డు అని వారు తెలిపారు శాశ్వత వంతెన పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని అంతవరకు అప్రోచ్ రోడ్డు ఈసారైనా కమిషన్లకు కక్కుర్తి పడకుండా నాణ్యమైన దారి నిర్మించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి చంద్ర నియోజకవర్గ కార్యదర్శి పి చంద్రశేఖర్ సహాయ కార్యదర్శి కొమ్మది ఈశ్వరయ్య , నాగేశ్వరరావు వల్లూరు మండల కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ద్రవిడ సురేష్ తదితరులు పాల్గొన్నారు