ఎక్కడ సభ పెట్టిన వచ్చి మద్దతు తెలుపుతా

133

– వీఆర్వోలకు ఈటల రాజేందర్ సంఘీభావం

వీఆర్వోలను రెవన్యు డిపార్ట్మెంట్ కాకుండా ఇతర డిపార్ట్మెంట్లోని అడ్జెస్ట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వీఆర్వోలు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న వీఆర్వోలకు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయంకు వెళ్లి విఆర్ఓ లతో ఈటల రాజేందర్ మాట్లాడారు.

ఎక్కడ సభ పెట్టిన తాను వచ్చి మద్దతు తెలుపుతానని భరోసా ఇచ్చారు.
అన్ని డిపార్ట్మెంట్లకు ఆయువుపట్టు అయిన రెవిన్యూ డిపార్ట్మెంట్ ను లేకుండా చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ధరణి తీసుకొచ్చి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. వీఆర్వోలు, మిగతా రెవిన్యూ ఉద్యోగులు అద్దంకిగా మారారని వారిని తొలగిస్తున్నారు.రెవెన్యూ ఉద్యోగులకు కనీస మర్యాద లేకుండా చేశారు. వారిని సమాజంలో దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. వీఆర్వోలను రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.