– కాళేశ్వరం కరెంటు వాడకపోయినా 3500 కోట్లు కరెంటు బిల్లు కట్టాల్సిందే
– 10 వేల కోట్ల అప్పుతో నెల నెలా జీతాల కోసం అప్పులు
– జిల్లా బీజేపీ కార్యాలయంలో బడ్జెట్ మీద ఏర్పాటుచేసిన మేధావుల సదస్సులో పాల్గొన్న ఈటల రాజేందర్
తెలంగాణ ప్రభుత్వం ఎవరికి సాయం చెయ్యాలి ఎవరికి చేయవద్దు అనే సోయి లేదు. వందలఎకరాల బీడు భూములకు రైతుబంధు ఇస్తున్నారు. బెంజ్ కారులో వచ్చి చెక్కులు తీసుకుపోతున్నారు. గొల్ల కురుమల కుటుంబంలో పుడితే చాలు ఎంత డబ్బున్న సరే వారికి గొర్లు ఇచ్చారు. 2 కోట్ల గొర్రెలు ఇస్తే 4 కోట్ల పిల్లలు పెట్టాయి 6 కోట్ల గొర్రెలు అయ్యాయి అని కెసిఆర్ చెప్పే మాటలు శుద్ధ అబద్దం. దళితబంధు కింద ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కార్లు ఇస్తే నిజమైన పేద వారి పరిస్థితి ఏంటి ?
మనకి నాలుగు రకాల నిధులు వస్తాయి:
1. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలు,
2. 15th ఫైనాన్స్ కమీషన్ నిధులు,
(తెలంగాణ ఏర్పడినప్పుడు: 2.95% నిధులు వస్తే.. 14th ఫైనాన్స్ కమీషన్ కింద 2.43% నిధులు
15 th ఫైనాన్స్ కమీషన్ 2.01% నిధులు వచ్చాయి.)
పన్నుల్లో పగ పట్టారు అని కేటీఆర్ చెప్తున్న మాటలు శుద్ధ తప్పు. ఈ నిధులు ఫిక్సెడ్ ఉంటాయి అని ఆయన తెలుసుకోవాలి.
3. స్థానిక సంస్థల నిధులు.
4. బ్యాక్ వర్డ్ డిస్ట్రిక్ట్స్ నిధులు.
ఒక సారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన తరువాత ఒక్క రూపాయి కూడా అదనంగా రావు అని తెలిసి కూడా కేంద్రం నుండి డబ్బులు వస్తాయి అని బడ్జెట్లో పెట్టీ కేసీఆర్ మోసం చేశారు. 2,95,000 కోట్ల బడ్జెట్ పెడితే .. అందులో 55 వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా రాదు అని తెలిసి కూడా బడ్జెట్ లో పెట్టి మభ్యపెడుతున్నారు. దీనివల్ల పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాల్లో కోత పెడతారు. మళ్లీ వీరి కళ్ళల్లో మట్టికొడతారు. టాంక్ బంద్ మీద విగ్రహాల కోసం పెట్టిన డబ్బులు కూడా ఎస్సీ సబ్ ప్లాన్ కింద పెట్టిన నిధులుగా చూపించారు. వారి ప్రయోజనం కోసం ఖర్చు చెయ్యలేదు.
కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఉంటే GDP బాగా ఉండేది అన్నారు. కానీ కరోనా వచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయినా కూడా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంది అనే విషయం ఆయన గుర్తుంచుకోవాలి. ఇంగితజ్ఞానం కోల్పోయి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ప్రతిదీ ఎన్నికల కోణంలోనే మాట్లాడుతున్నారు. ఇది మంచిపద్దతి కాదు. కేంద్రం బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండేచర్ ఎక్కువ పెడితే.. రాష్ట్రంలో అతి తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండేచర్ పెట్టారు. ఇది తెలంగాణ పతనానికి నాంది.
తెలంగాణ వచ్చినప్పుడు GSDP లో అప్పు (77వేల కోట్లు)17 % ఉంటే ఇప్పుడ అది 38% (5 లక్షల కోట్లు)కు అప్పు పెరిగింది. కెసిఆర్ అప్పు చేసి పప్పుకూడు తినిపిస్తున్నారు. అదే కేంద్రం అప్పు 52% నుండి 49% కి తగ్గించారు. అంటే 3% తగ్గించారు. కరెంటు చార్జీలు ACD పేరుతో వసూలు చేస్తున్నారు. అడిషనల్ కంజెప్షన్ చార్జెస్ ఒక్కసారి కడితే అది తిరిగిరాదు. కాళేశ్వరం కరెంటు వాడకపోయినా 3500 కోట్లు కరెంటు బిల్లు కట్టాల్సిందే. సింగరేణి తెలంగాణ వచ్చినప్పుడు 5 వేల కోట్ల డిపాజిట్లతో కళకళలాడేది. కానీ ఇప్పుడు 10 వేల కోట్ల అప్పుతో నెల నెలా జీతాల కోసం అప్పులు చేస్తుంది.