Suryaa.co.in

Telangana

చిన్నారి బాలుడు ప్రదీప్ కుటుంబానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం

అంబర్ పేట లో వీధికుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన చిన్నారి బాలుడు ప్రదీప్ కుటుంబానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. చాలా విషాదకరమైన ఘటన అని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కలు, కోతుల సమస్య తీవ్రంగా ఉందని, సమస్య పరిష్కారానికి ఈ నెల 23 న ఉదయం 11.00 గంటలకు మాసాబ్ ట్యాంక్ లోని తమ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. వీధి కుక్కలు, కోతుల బెడద సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశంలో GHMC, వెటర్నరీ అధికారులతో ప్రత్యేక చర్చిస్తామని చెప్పారు. మహిళలు, చిన్నారులు అధికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారని, అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు.

LEAVE A RESPONSE