Suryaa.co.in

Telangana

దాడి చేసిన బిఆర్ ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలి

– యూత్ కాంగ్రెస్ నాయకులు పవన్ పై జరిగిన దాడిని ఖండించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

యువజన కాంగ్రెస్ నేత తోట ప్రవీణ్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్పడిన దాడిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐసిసి అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం వరంగల్లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ పై అరాచకంగా బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం ఆప్రజాస్వామికమని పేర్కొన్నారు. దాడికి ప్రోత్సహించిన, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన బావ ప్రకటన స్వేచ్ఛ హక్కును హరించడం రాజ్యాంగ విరుద్ధమనే విషయాన్ని పోలీసులు గ్రహించాలని సూచించారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు.

LEAVE A RESPONSE