హాయిగా ఆదమరచి
నిద్రించాలి అనుకున్న ప్రతిసారి
నిదుర కనులలో కలలా
ఎదలోని నీ రూపం
ఎదురై స్వాగతిస్తుంటే
నన్ను నాలో ఉండనియ్యక
“ఎటో వెళ్ళిపోతుంది మనసు”..!!
ఊహల సరిహద్దులలో
నిన్ను చేరాలి
అనుకున్న ప్రతిసారి
పువ్వులోని పరిమళంలా
నా చూపుల దారులలో
మధుర భావనలు
ఉయ్యాల ఊగుతుంటే
“ఎటో వెళ్ళిపోతుంది మనసు”…!!
మరో ప్రబంధం రాయాలి
అనుకున్న ప్రతిసారి
ఊపిరిలో ఊపిరిగా
నన్ను నేనే మరిచిపోతూ
ఏదో తెలియని రహస్యం
నిన్నే స్మరించేలా మార్చేస్తూ
నా ఉనికే నాకు తెలియక
“ఎటో వెళ్ళిపోతుంది మనసు”…!!
– నలిగల రాధికా రత్న