Suryaa.co.in

Political News

చంద్రబాబు అభిమాని కూడా అయన మాట వినడు.. కాంగ్రెస్ కి వోటేయక మానడు

అసలైన విమోచన దినం నవంబర్ ౩౦

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అవకాశం వాకిట్లో నిలబడి ఉంది . రిటర్న్ గిఫ్ట్ ఆకర్షణీయమైన ప్యాకింగులో సిద్ధంగా ఉంది . మన విముక్తి కోసం , విమోచన కోసం , స్వేచ్ఛ కోసం , స్వాతంత్య్రం కోసం , ఆత్మ గౌరవం కోసం , మానవ హక్కుల కోసం నవంబర్ ౩౦ రారమ్మని పిలుస్తోంది.

సీమాంధ్రులంతా ఇప్పటికే డిసైడయిపోయారు . గంప గుత్తగా, ఒక బ్లాక్ వోట్ గా కాంగ్రెస్ కు వోటెయ్యడానికి డిసైడ్ అయిపోయారు . ఇందులో కులాలు, పార్టీల ప్రసక్తి లేదు .

కమ్మోళ్ళందరూ అరికపూడి గాంధీని, మాగంటి గోపినాథ్ ని, నల్లమోతు భాస్కర్ రావు ని కాదని ఒక జగదీశ్వర్ గౌడ్ ని, ఒక అజారుద్దీన్ ని , ఒక లక్ష్మా రెడ్డి ని ఓటేసి, ప్రచారం చేసి గెలిపిస్తుంటే, రేవంత్ రెడ్డి, సీతక్కల నాయకత్వాన్ని వానర సైన్యంలా బలపరుస్తుంటే , దానిలో కులమెక్కడుంది ?

ఎవరూ అడక్కుండానే కాంగ్రెస్ ర్యాలీల్లో తెలుగు దేశం జండాలు కట్టుకుని పాల్గొంటుంటే, తెలుగు దేశం పార్టీ కి ఆంధ్ర ప్రాదేశికత్వం అంటకట్టే అవకాశమేది ?

నేటి కఠిన వాస్తవమేమిటంటే, చివరికి చంద్రబాబే వచ్చి తెరాసకో , భాజపాకో వోటేయమన్నా , ఒక్క సీమాంధ్రుడు గానీ , ఒక్క కమ్మోడు గానీ , ఒక్క తెలుగు దేశం అభిమాని గానీ , చివరకు ఒక్క చంద్రబాబు అభిమాని కూడా అయన మాట వినడు. కాంగ్రెస్ కి వోటేయక మానడు.

కెసిఆర్ ఏమిటో , బీజేపీ ఏమిటో ఎప్పుడో తెలియక కాదు కానీ , ఇన్నాళ్లకు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రుల ఓట్లను అందుకునే స్థాయికి ఎదిగింది . అదికూడా రేవంత్ నాయకత్వం కాబట్టి . దానికి రాహుల్ గాంధీ సున్నితత్వం , నిజాయితీ , హ్యూమన్ ఫేస్ , చంద్రబాబు పట్ల తనకున్న గౌరవం తోడయ్యాయి.

ప్రస్తుతానికి సీమాంధ్రుల ఈ నిర్ణయం పూర్తిగా సమర్ధనీయం . తెలంగాణ సమాజం మొత్తం ఈ రోజు కెసిఆర్ , బీజేపీ లను బొంద పెట్టడానికి సిద్ధమైంది . సీమాంధ్రుల మనోగతం కూడా అదే పంధాలో పయనించడం శుభ పరిణామం . దీర్ఘ కాలంలో సీమాంధ్రుల రాజకీయ పయనం మొత్తం తెలంగాణ సమాజంతో సమాంతరంగా సాగడానికి ఇది నాంది.

ఇంకోటి , దీర్ఘ కాలంలో సీమాంధ్రుల బ్లాక్ వోట్ రేవంత్ , సీతక్కలకు ఒక నమ్మకమైన వోట్ బ్యాంకు గా తయారవుతుంది . కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడికీ తనదంటూ వోట్ బ్యాంకు లేదు . అలా వ్యక్తిగత వోట్ బ్యాంకు కలిగిన చివరి నాయకుడు చెన్నా రెడ్డి. ఆ తరం అంతరించింది . ఇక మీదట రేవంత్ , సీతక్క టీం సీమాంధ్రులకు ఆలంబనగా , సీమాంధ్రులేమో రేవంత్ , సీతక్కలకు ఒక వోట్ బ్యాంకు గా ఉండాలంటే దానికి నవంబర్ ౩౦ న ఆరంభోత్సవం జరగాలి.

నవ్వాపుకోలేకపోయిన కేటీఆర్ కు , విప్రో జుంక్షన్లో పోలీసుల దమనకాండకు , మర్నాడు టెకీల కంపెనీ యాజమాన్యాలకు పోలీసులు పంపిన తాఖీదులకు , చేసిన అరెస్టులు , లాఠీ ఛార్జీలకు , పెట్టిన కేసులకు , మెట్రోలో నల్ల చొక్కాలతో ప్రయాణిస్తేనే బొక్కలిరగ దీసిన దొరతనపు దౌష్ట్యాలకు, ఓ ఆర్ ఆర్ మీద పోలీసుల భీభత్సానికి , సంధ్యా కన్వెన్షన్లో ఇండోర్ మీటింగుకి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఏడిపించినదానికి, గచ్చి బౌలి బాలయోగి స్టేడియంలో పర్మిషన్ కోసం హై కోర్ట్ చుట్టూ తిప్పినదానికి , ఇక్కడీ నాటకాలేమిటి , కావాలంటే రాజమండ్రి వెళ్లి చేసుకోండి అన్న కేటీఆర్ అహానికి , ఆలుగడ్డలు , ఉల్లిగడ్డల ఉడత ఊపుగాళ్ళకి , నిఖార్సైన రిటర్న్ గిఫ్ట్ నవంబర్ ౩౦ నాడివ్వండి.

గత కొన్ని దశాబ్దాలుగా కోల్పోయిన స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని తిరిగి పొందుదాం . మనకు తెలియకుండానే మనం కూరుకుపోయిన బానిసత్వం నుంచి బయటపడదాం. డిసెంబర్ మూడున విముక్తి పండగ చేసుకుందాం.

– కంకణాల శ్రీనివాసరావు

LEAVE A RESPONSE