కేరళలో పంపనూరు రైల్వే స్టేషన్ పక్కన చెత్త కుప్ప దగ్గర ఒక పెద్దావిడ బిచ్చం అడుగుతూ కుర్చుని ఉంది .
ఆ పక్కనే ఒక ఆవిడ వెళుతూ …..
ఈ పెద్ద ఆవిడని చూసి , మల్లపురం స్కూల్లో నేను చదివేటప్పుడు లెక్కల టీచర్ కదా అని ఆశ్చర్యపోతూ ….. దగ్గరికి వెళ్లి విచారించగా ,
అవును నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా పిల్లలు నన్ను వదిలేసి వేరే ఊర్లో వెళ్ళిపోయారు , వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు ఇలాగ బిచ్చమెత్తుకుంటున్న ను అని దుఃఖంతో చెప్పింది.వెంటనే శిష్యురాలు కళ్ళమ్మట నీళ్ళు తిరిగి ,
ఆ పెద్దావిడని ఇంటికి తీసుకునివెళ్ళి …..
భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చింది.
తరువాత టీచర్ భవిష్యత్తు గురించి ఆలోచించి శాశ్వతంగా భద్రత ఉంచాలని ఆలోచించింది.
వెంటనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది. అది చూసిన పూర్వ శిష్యులు వెంటనే స్పందించి అందరూ కలిసి భద్రతా గృహంలో ఉంచారు. తల్లిని పిల్లలు వదిలేసినా శిష్యులు మాత్రం వదల్లేదు..
శిష్యులందరికీ అభివందనాలు
– స్నేహహస్తం డెవలెప్మెంట్ సొసైటీ