Suryaa.co.in

Andhra Pradesh

పదవీకాలం ముగుస్తున్నా స్టిక్కర్ల బతుకేనా…

అభివృద్ధి అంటే రంగులు వేసుకోవడమేనా?!

ఇవి రాజధాని పరిధిలోని నిడమర్రులో పేదలకోసం గత టిడిపి ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలు. పేదలకు కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని జగన్ మేం నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసిపి రంగులేసుకున్నారు. నాలుగేళ్ల వైసిపి పాలనలో చేసిందేమైనా ఉంది అంటే అది స్టిక్కర్లు వేసుకోవడమే. కూల్చివేతలు మినహా పదవీకాలం ముగిసే లోపు ప్రజలకోసం నేను ఫలానా మంచి పని చేశానని ఒక్కటైనా చూపించగలరా? ఇంకా ఎంతకాలం ఈ స్టిక్కర్ల బతుకు జగన్మోహన్ రెడ్డీ?! మేము కట్టిన టిడ్కో ఇళ్ల దగ్గర కనీసం మౌలిక వసతులు కల్పించడం జగన్ ప్రభుత్వానికి చేతకాలేదు.

….నారా లోకేష్,
(యువగళం పాదయాత్ర నుండి.)

LEAVE A RESPONSE