-రాహుల్ ది భారత్ జోడో యాత్ర కాదు… కాంగ్రెస్ చోడో యాత్ర
-ఢిల్లీ లిక్కర్ మాఫియాలో మూలాలు తెలంగాణ లో తేలుతున్నాయి
-బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా కె లక్ష్మణ్
ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న చీడను వదిలించుకునేందుకు మీరంతా భాగస్వాములు అయ్యారు.అవినీతి, కుటుంబ కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగి పోయారు.
ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నాం.రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది.మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ కు భజనపరులుగా మారారు.VRA లు, విద్యార్థులు, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.తెలంగాణ లో వచ్చేది బీజేపీ నే.ప్రజల దృష్టి మళ్లించేందుకే జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ డ్రామాలు చేస్తున్నాడు.
కాంగ్రెస్ కేజ్ తోక పార్టీ trs.అన్ని ప్రాంతీయ, అవినీతి పార్టీల కూటమితో కేసీఆర్ ఏకమయ్యాడు.గుంపులుగా వచ్చినా… మోడీ సింగిల్ గానే వస్తాడు.అవినీతి రహిత పాలన అందిస్తున్నారు మోడీ.రాజస్థాన్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. 2/3 మెజారిటీ తో బీజేపీ గెలుస్తుంది.రాజస్థాన్ లో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి… రైతు రుణమాఫీ చేయలేదు.
రాహుల్ ది భారత్ జోడో యాత్ర కాదు… కాంగ్రెస్ చోడో యాత్ర.ఢిల్లీ లిక్కర్ మాఫియాలో మూలాలు తెలంగాణలో తేలుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లో కేసీఆర్ వేలకోట్ల అవినీతి కి పాల్పడ్డారు.కేసీఆర్ ఇప్పుడు అపర కుబేరుడు గా మారాడు.తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కు ఉన్న ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఎన్ని?సైబర్ క్రైమ్ లో తెలంగాణ నెంబర్ 1.
హైదరాబాద్ పేరుకు మాత్రమే రాజధాని, వర్షం వస్తే… మొత్తం మునిగిపోతుంది.
మూసీ ప్రక్షాళన పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ ఏం చేశాడో సమాధానం చెప్పాలి.హుస్సేన్ సాగర్ ప్రక్షాళన… కొబ్బరి నీళ్లు ఏమయ్యాయి?హైదరాబాద్ వాసులు కట్టే పన్నులతో ఎంఐఎం వాళ్లకు మాఫీ చేస్తున్నారు.పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయడం లేదు.Trs, కాంగ్రెస్, మజ్లిస్ వేరు కాదు.Trs అవినీతి పాలనకు చరమగీతం పాడాలి.బీజేపీ దెబ్బకే… సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం అంటూ… వేడుకలు నిర్వహిస్తున్నారు.