ఈయు కి భారత్ కి మధ్య ట్రేడ్ డీల్ జరిగింది.. సహజంగానే ఈయు అంటే లగ్జరీ కార్లకి (బెంజ్, బీఎండబ్ల్యు , ఆడి, పోర్ష్, లాంబో, ఫెరారీ, వాల్వో, స్కోడా, వొక్స్ వాగన్ etc etc) ఫేమస్ కాబట్టి సోషల్ మీడియా అంతా కార్ల ధరలు తగ్గుతాయ్ అని హోరేత్తిపోయింది. వాస్తవానికి అదేం లేదు.. సిబియు యూనిట్స్ (అంటే మన దేశంలో అసెంబల్ అయ్యేవి) పెద్దగా తగ్గవు.. దిగుమతి చేసుకునేవి కేవలం 2% మాత్రమే.. అవి తగ్గుతాయి.
ఇప్పుడు అంత మంది దేశాధినేతలు కూర్చుని 2% కార్ల కోసం డీల్స్ చేస్తారా.. కనీసం కామన్ సెన్స్ తో ఆలోచించినా అర్ధం అవుతుంది.. ఏదో మోడీ అంటే ఒక గుడ్డి ద్వేషం.. బీజేపీ అంటే ఏదో మంట.. విమర్శించాలి అని విమర్శిస్తారు..
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందిగా.. చాట్ జీపీటీనో, జెమినీ నో అడిగితే వివరం చెబుతుందిగా.. అబ్బే అవన్నీ అక్కర్లేదు మనకి.. ముందు బురద వేసేయాలి.. నిజానికి ఈయు ట్రేడ్ డీల్ లో కార్లు అనేది అసలు పెద్ద విషయం కాదు.. ఇంకా పెద్దవి వేరే ఉన్నాయి.
1. చాక్లెట్, బిస్కెట్స్, ఆలీవ్ ఆయిల్, వైన్, చీజ్ బాగా తగ్గుతాయి.. రెస్టారెంట్ ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది
2. బట్టలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, చెప్పులు, బ్యాగులు డ్యూటీ ఫ్రీ ఎగుమతులకు ఈయు ఒప్పుకుంది. ఈ రంగాల్లో మనకి ఊతం వస్తుంది.
3. ఐటీ ఉత్పత్తుల ఎగుమతులకు మరింత సరళీకృత విధానానికి ఓకే అన్నారు.. మన ఐటీ ఇండస్ట్రీకి ఇప్పటి వరకూ అమెరికానే పెద్ద దిగుమతిదారు. ఇప్పుడు ఈయు కూడా.
4. మోబిలిటీ పాక్ట్ కింద స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, స్కాలర్స్ సులభంగా ఈయు ఇండియా మధ్య తిరగడానికి ఓకే అన్నారు..స్పెయిన్ వారు ఐదేళ్ళు వర్క్ వీసా ఇస్తాం అని ఒప్పుకున్నారు..
5. యూరోపియన్ వైద్య పరికరాల మీద టారిఫ్ 11% కి తగ్గించారు.. మంచి వైద్య పరికరాలు చవకగా వస్తాయి.. అమెరికా మీద ఆధారపడడం తగ్గుతుంది..
6. మన దగ్గర్నుండి టీ, కాఫీ, మసాలా ఉత్పత్తులు ఎగుమతికి ఈయు ఒప్పుకుంది.
7. ఈయు రెగ్యులషన్స్ కి అనుగుణంగా మన SME లను అనుమతించారు.
8. ఏపీ నుండి ఎగుమతి అయ్యే రొయ్యలు, చేపల మీద టారిఫ్ 26% నుండి దాదాపు సున్నాకి వచ్చింది.
9. విశాఖ, రామాయపట్నం వద్ద స్పెషల్ కోల్డ్ స్టోరేజీలు (ఆక్వా), కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేయడానికి ఈయు ముందుకి వచ్చింది.
ఇంకా ఉన్నాయి.. రాయడానికి ఓపిక లేదు.. సెర్చ్ చేసుకోండి..
సామాన్యుడికి మేలు అంటే ఇంకేం చేయాలి.. యూరోప్ వాళ్ళు వచ్చి అమ్మ ఒడి ఇవ్వాలా ఏమిటి?
– అయ్యల సోమయాజుల సుబ్రమణ్యం