– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య
-టీడీపీ కేంద్రకార్యాలయంలో ఘనంగా బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి
-బాబూ జగజ్జీవన్ రామ్ దేశానికి, దళితజాతికి చేసిన సేవల్ని కొనియాడిన నేతలు. దళితుల హక్కులకోసం జగజ్జీవన్ రామ్ చేసిన పోరాటం సదా చిరస్మరణీయమని శ్లాఘించిన నేతలు
ప్రతి దళితుడు జగజ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకోవాలి : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య
“దళితులకు అవకాశం లభిస్తే వారు ఏ వర్గానికి తీసిపోరు అనడానికి జగజ్జీవన్ రామ్ గారే నిదర్శనం. బాబూ జగజ్జీవన్ రామ్ దాదాపు 5 దశాబ్దాలపాటు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కేంద్రమంత్రిగా పనిచేసిన దళిత బిడ్డ. కేంద్రమంత్రిగానే కాకుండా చేపట్టిన అన్నిపదవులకు వన్నెతెచ్చారు. ప్రతిదళిత బిడ్డ జగజ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకోవాలి. దళితుడు అయినప్పటికీ అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, ఉన్నతస్థానాలకు ఎదిగిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి జయంతి కార్యక్రమాన్ని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహిం చడం ఆనందదాయకం.”
బాబూ జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రతిష్ఠించింది టీడీపీప్రభుత్వమే. చంద్రబాబు బాబూ జగజ్జీవన్ రామ్ పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభంచారు : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు
“మహనీయులు, మహాత్ములు, పూజ్యులు బాబూ జగజ్జీవన్ రామ్ గారి 115వ జయంతి ఉత్సవాలు పార్టీకార్యాలయంలో నిర్వహించడం నిజంగా అభినందనీయం. జగజ్జీవన్ రామ్ గారు 115ఏళ్లక్రితం భారతసమాజంలో ఉన్న పరిస్థితులపై పోరాడారు. 1908లో జగజ్జీవన్ రామ్ పుట్టినప్పుడు ఉన్నపరిస్థితి, ఎదుగుదలలో ఆయనపడిన కష్టాలు తరువాతి తరాలకు ఉండకూడదని ఆయన ఎంతో కష్టపడ్డారు. సమాజానికిదూరంగా నెట్టివేయబడిన వర్గాల అ భ్యున్నతికోసం జగజ్జీవన్ రామ్ పోరాడారు. దళితుల హక్కులకోసం ఆయన చేసిన పోరాటం నిజంగా ప్రశంసనీయం. అనేక ముఖ్యశాఖలకు మంత్రిగా వ్యవహరించడమేగాకుండా, ఉప ప్రధానిగా కూడా ఆయన పని చేశారు. దళితుడు అయినందునే ఆయన తృటిలో ప్రధాని పదవి కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించాకే కులాల మధ్య అంతరాలు తొలగించేందుకు పునాదులు పడ్డాయి. బాబూ జగజ్జీవన్ రామ్ స్మృత్యర్థం హైద రాబాద్ లో గొప్పకాంస్యవిగ్రహాన్ని టీడీపీప్రభుత్వమే ఏర్పాటుచేసింది. ఆయన పేరుతో కమ్యూనిటీ హాల్, ఆయనపేరుతో ఉచిత విద్యుత్ పథకం చంద్రబాబు అమలుచేశారు. పూలే, జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ వంటి మహానీయులబాటలో టీడీపీ నడుస్తోంది అని చెప్పడానికి గర్వపడుతున్నాము. అందరితో సమానంగా నేడు దళితులు జీవిస్తున్నారు అంటే జగజ్జీవన్ రామ్ వంటి మహానీయుల త్యాగాలే కారణం.”
టీడీపీ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ వంటి మహానీయుల్ని సముచితంగా గౌరవిస్తే, వైసీపీప్రభుత్వం వారిని నిర్లక్ష్యంచేసి దళితుల్ని అవమానించింది : మాజీమంత్రి కే.ఎస్.జవహర్
“ ఆత్మగౌరవ ప్రతీకగా, స్వాతంత్ర్యసమరయోధుడిగా, భారత ఉపప్రధానిగా బాబూ జగజ్జీవన్ రామ్ సదా చిరస్మరణీయులు. స్ఫూర్తివంతమైన ఆయన జీవితం నేటి యువతకు నిజంగా ఆదర్శనీయం. దేశంలో దళితులే కాకుండా ప్రజలందరూ బాగుండాలనే ఆలోచనతో పనిచేశా రు. ప్రత్యేకంగా పార్టీ పెట్టి 15మంది ఎమ్మెల్యేలను ఆరోజుల్లోనే శాసనసభకు పంపిన ధైర్యశా లి జగజ్జీవన్ రామ్. 1930ల్లోనే అణగారిన వర్గాల కోసం ప్రత్యేకపార్టీ స్థాపించారు. రైల్వేశాఖలో ఆయన తీసొచ్చిన సంస్కరణలవల్లే దళితబిడ్డలు ఉన్నతస్థానాల్లో ఉండగలిగారు. అంబేద్కర్ తో పాటు, బాబూ జగజ్జీవన్ రామ్ ని టీడీపీ సముచితంగా గౌరవిస్తోంది. వైసీపీప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా జగజ్జీవన్ రామ్ గారిని నిర్లక్ష్యంచేసింది. దళితుల్లో అనైకత్యకు శ్రీకా రం చుట్టింది వైసీపీప్రభుత్వం. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ లను స్ఫూర్తిగా తీసుకొని నేటి దళి త యువత ముందుకు సాగాలి.” కార్యక్రమంలో టీడీపీఅధికార ప్రతినిధి పాతర్ల రమేష్, ఎస్సీ సెల్ కోడూరి అఖిల్, కంభంపాటి శిరీష, దేవతోటి నాగరాజు, మేకల అనిల్ కుమార్, బొక్క నాగరాజు, జడ రాంబాబు, రాష్ట్రపార్టీ కార్యదర్శి ఏ.వీ.రమణ, పార్టీ ఆహ్వానకమిటీ సభ్యులు హాసన్ బాషా, ఎన్ఆర్ఐ సెల్ చప్పిడి రాజశేఖర్, ఉపాధి హామీ మండలి సభ్యులు పీరయ్య, హెచ్.ఆర్.డీ మెంబర్ రాజేంద్రప్రసాద్, ఓటర్ రామకృష్ణ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.