•అదే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి
•జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
భారత రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని స్వీకరించి పాటించాల్సిన అవసరం ప్రతి పాలకుడిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలోని బిడ్డలూ ఉన్నతమైన చదువులు చదువుకోగలిగిన రోజున ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన
వారమవుతామన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం కల్పించిన హక్కుల కోసం ప్రశ్నించగలుగుతామన్నారు. అదే సిద్ధాంతాన్ని జనసేన పార్టీ ముందుకు తీసుకువెళ్తుందనీ, అందరూ సమానంగా ఎదగాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే పార్టీ లక్ష్యమని తెలిపారు. అదే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఎస్సీ, ఎస్టీల నిధులు పక్కదోవ పట్టిస్తున్నారు
నేటి పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులు సైతం పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. పాలకులు కళ్లు తెరిచి వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడాల”ని కోరారు.
సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.