‘అమ్మఒడి’పై తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుల లేఖలు

‘అమ్మఒడి’పై తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుల లేఖలు

గుంటూరు: అమ్మఒడి పథకం అందాలంటే 75శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని అమలు చేసే క్రమంలో ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు లేఖలు రాస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు వెళ్తున్నాయి. మీ పిల్లల హాజరు 75శాతం ఉండేలా చూడాలని ప్రధానోపాధ్యాయుల లేఖలో సూచిస్తున్నారు. ఈ లేఖపై తల్లిదండ్రుల సంతకం చేయించుకుని రావాలని విద్యార్థులకు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల్ని తల్లిదండ్రులకు తెలియజేసేందుకు
Whats-App-Image-2021-12-06-at-14-24-30ఈ మేరకు లేఖలు రాస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఆ తర్వాత తల్లిదండ్రుల నుంచి ఇబ్బంది ఉండొద్దని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరు కూడా ప్రభుత్వం నిర్దేశించిన యాప్‌లో నమోదు చేయాల్సి వస్తోంది. ఫొటోలను జత చేయటం తప్పనిసరి. కాబట్టి విద్యార్థుల హాజరు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా ఈ ఏడాది అమ్మఒడి పథకానికి సంబధించి నగదుని వచ్చే ఏడాది జూన్‌లో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకూ ఉన్న హాజరును బట్టి వారికి పథకం వర్తింపుపై నిర్ణయం తీసుకుంటారని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల హాజరులో కాస్త తగ్గుదల ఉంటుందని.. దీని ఆధారంగా పథకం వర్తించకుండా చేస్తారేమో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply