Suryaa.co.in

Features

అందరూ మనుషులే. అందరూ సమానమే.

వీరు మన పూర్వీకులు …. వీరిలో ఎవరు సనాతన అని , ఎవరు ముస్లిం , ఎవరు సిక్కులు , ఎవరు క్రిస్టియన్ ,ఎవరు పార్శీలు , ఎవరు జైనులు , ఎవరు బౌద్దులు , ఎవరు బ్రాహ్మణులు? ఈ ఆదిమానవుల ప్రస్తుత వారసులు ఏమి చెప్పగలరు ? శూద్రుడు ఎవరు? క్షత్రియుడు ఎవరు ? ఎవరు వైష్యుడు ? ఎవరు హరిజనుడు ? ఎవరు గిరిజనుడు ? ఎవరు బి సి లు , ఎవరుమానవుడు ? ఎవరు మృగం ?

ఈచిత్రంలో ఉన్న మన పూర్వీకులు తాత అమ్మ మ్మ అత్త , మామ , పిన్ని , బాబాయి , బందువులు ఎవరోకూడా చెప్పగలమా? దయచేసి ఈ ఫోటోల ద్వారా మన కులం మరియు మతాన్ని నిరూపించగలమా ? కులం- మతం మనుషులే సృష్టించారు. కాబట్టి కులమతాల మధ్య యుద్ధం అవసరమా ? మంచి చదువుకోసం కృషిచేద్దాం , విద్య ద్వారా మనిషి చంద్రుడి ని , అంగారకుడిని చేరుకున్నారు. అక్కడికి వెళ్ళటానికి కులం ద్వారా చేరుకున్నామా? మతం ద్వారా చేరుకున్నామా? చదువు జ్ఞానం ద్వారా చేరుకున్నాము. కులం,మతం భూమిపై మాత్రమే! అందరూ మనుషులే. అందరూ సమానమే.

– పులగం సురేష్, జర్నలిస్టు

 

LEAVE A RESPONSE