గోగుల్లమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలి
– వాసంశెట్టి సత్యం చే గోగుల్లమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు
రామచంద్రపురం: మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జీవితం అవసరమని, తద్వారా మానసిక ప్రశాంతత పొంద వచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. వెలంపాలెం గ్రామంలో కొలువై, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధిగాంచిన గోగుల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి వాసంశెట్టి సత్యం, ద్రాక్షారామం సర్పంచి కొత్తపల్లి అరుణ, సర్పంచ్ టేకుమూడి సత్యనారాయణ దంపతులు చేతుల మీదుగా మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు.
శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆడపడుచు అయినందున పసుపు కుంకుమ,సారె, పట్టు వస్త్రాలను ఆలయం నుంచి ఆలయ ఈఓ ఏవి దుర్గా భవాని, వేద పండితుల ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం రామచంద్రపురం నియోజవర్గం ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిపించాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ ప్రజలు,భక్తులు పాల్గొన్నారు.