– క్రీడా రంగానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత
– బాక్సింగ్ క్రీడాకారినికి “సత్యం వాసంశెట్టి ఫౌండేషన్” ఆర్థిక సహాయం.
రామచంద్రపురం : క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవచ్చని, విద్యతోపాటు క్రీడలకు కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తున్నదని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. రామచంద్రపురం నుంచి అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన పేద కుటుంబానికి చెందిన వడ్డాది నళినికు “సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా బాక్సింగ్ పోటీలకు సంబంధించిన ఫీజులో 20 శాతం నిధులును ఆర్థిక సహాయంగా సత్యం అందించారు. అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు సన్నద్ధమవుతున్న నళిని.. రామచంద్రపురంతో పాటు, రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆశీస్సులు అందజేశారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందించడంతోపాటు, క్రీడలకు సమయం కేటాయించాలని తద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఒత్తిడిను దూరం చేయవచ్చని ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం అన్నారు.