Suryaa.co.in

Andhra Pradesh

మొక్కలు పెంచటం ప్రతి ఒక్కరు సామాజిక భాద్యతగా భావించాలి

– మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

జీవకోటి రాశుల మనుగడకు మొక్కలే జీవనాధారమని, మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం, పంగులూరువారిపాలెంలో వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా స్ధానిక టీడీపీ నేతలతో కలిసి మొక్కలు నాటారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ….మొక్కలను మనం కాపాడితే అవి మనలను కాపాడతాయని అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. సహజవనరులు, అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ వెళ్లిన ప్రతి ప్రాంతంలో చెట్లలను విపరీతంగా నరికేశారు. పర్యావరణంలో మొక్కలు లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. రానున్న ఐదేళ్లలో ఏపీని గ్రీన్ ఏపీగా మార్చేందుకు ప్రతి ఒక్క పౌరుడు తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంచేందుకు ముందుకు రావాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు.

ఈ సంధర్బంగా గ్రామ పారిశుధ్యం కోసం రూ. 5 లక్షల విలువైన ట్రాక్టర్ ను బహుకరించిన సీ పుడ్స్ యజమాని రామారావుని మంత్రి, టీడీపీ నేతలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు జిల్లా పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు రవి, పంగులూరి గోవిందయ్య, స్ధానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE