మహిళా శక్తిని వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు

-15 మంది మహిళలతో మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించుకోవడం సంతోషాన్నిచ్చింది
-యార్డును లాభాల బాటలో నడిపించాలి
-ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి {ఆర్కే)

కుటుంబంలో పొదుపు చేసే శక్తి మహిళలకు ఉందని ఆ మహిళా శక్తి ని వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు చూడవచ్చునని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు.మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్ తో పాటు 13 మంది డైరెక్టర్ పదవులను మహిళలకు కేటాయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 15 మంది సోమవారం ఎమ్మెల్యే ఆర్కే ను ఆటో నగర్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వేర్వేరుగా పుష్ప గుచ్ఛం ఇచ్చి తమకు పాలకవర్గం లో తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ,రైతులు రైతు కూలీల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు.అదే బాటలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి ముందుకెళ్తు మరిన్ని మెరుగైన పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.సామాజికంగా,రాజకీయంగా,ఆర్ధికంగా ముందుకెళ్తున్న మహిళలకు 33 శాతం నుండి 50 శాతానికి రిజర్వేషన్లు పెంచారని అన్నారు. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని 15 మంది మహిళలతో నియమించుకోవటం గొప్ప విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.యార్డు స్వరూపాన్ని తెలుసుకొని లాభాల బాటలో పయనింపజేయాలని ఇందుకు పాలనలో తగిన స్వేచ్ఛ నిస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరూ వారికిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మార్కెట్ యార్డు చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి,వైస్ చైర్మన్ నాగలక్ష్మి,డైరెక్టర్లు ఆలూరి రాజ్యం,బాపనపల్లి అన్నపూర్ణ,పాటిబండ్ల కుమారి,షేక్ మాలిన్,దాసరి ఇస్సాకమ్న,కె ఈశ్వరమ్మ,ఎం శ్రీలక్ష్మి,గండికోట వెంకట రమాదేవి,బోనం శివ కుమారి,నటుకుల హేమాంజలి,బుర్రముక్కు బరతీదేవి,మల్లాది జ్యోతి,శిరందాసు యశోదా దేవి పాల్గొన్నారు.

బాధ్యతలు చేపట్టిన చైర్మన్
మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి కమిటీ కార్యాలయంలో తొలి సంతకం చేసి బాధ్యత లు చెపట్టారు.యార్డు సెక్రెటరీ డిసిహెచ్ చిన సుబ్బారావు ఆమె చేత సంతకం చేయించారు. వైస్ చైర్మన్ నాగలక్ష్మి,13 మంది డైరెక్టర్లు పదవి బాధ్యతలు చేపట్టారు. మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.

Leave a Reply