Suryaa.co.in

Andhra Pradesh

అధికార మదంతో వైసీపీ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు

-పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దాసోహమైంది
-న్యాయస్థానాల ద్వారా పార్టీ కార్యకర్తలకు అధినేత అండ
-నాయకుడి ఆజ్ఞ మనకు సుగ్రీవ ఆజ్ఞ
-పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టిన పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

కాంగ్రెస్ తెలుగుజాతికి చేస్తున్న అవమానాన్ని చూసి తట్టుకోలేక ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. 9నెలల్లోనే ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించారు.నాటి నుండి మహానాడు పేరిట ప్రతియేటా పార్టీ పండుగలు జరుపుకుంటున్నాం.2023లో రాజమహేంద్రవరం ఈ పండుగలకు వేదికైంది.మహానాడు కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

అధికార మదంతో వైసీపీ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతోంది. అరాచక పాలనకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత మనోధైర్యంతో ముందడుగు వేసి పార్టీ కార్యకర్తలకు అండగా కదులుతున్నారు. అధికారులు సైతం ప్రభుత్వ అరాచకాలకు తలొగ్గి తప్పుడు పనులు చేయాల్సివచ్చింది. ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొనకుండా వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టి నిరంకుశంగా వ్యవహరించింది.

పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దాసోహమైంది. న్యాయస్థానాల ద్వారా పార్టీ కార్యకర్తలకు అధినేత అండగా నిలబడ్డారు. 2019లో టీడీపీ అధికారానికి దూరమైందే తప్ప ప్రజలకు కాదు. ప్రభుత్వ దోపిడీ విధానాలపై బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచాం. వైసీపీ అరాచకాలపై ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.యువత, రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు యువతనే నారా లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

జనవరి 27న చంద్రబాబుకు ప్రీతిపాత్రమైన కుప్పం నుండి పాదయాత్రను ప్రారంభించారు. కాళ్లు బొబ్బలెక్కినా, అధికార పార్టీ ఎన్ని ఆటంకాలు విధించినా వాటినన్నింటినీ ఛేదిస్తూ 1400 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తిచేశారు. అధికారంలో ఉన్న అనకొండను గద్దె దించడానికి పార్టీ అధినేతకు పార్టీ కార్యకర్తలంతా సహాయ,సహకారాలు అందించాలి.

నాయకుడి ఆజ్ఞ మనకు సుగ్రీవ ఆజ్ఞ..

LEAVE A RESPONSE