– తెలంగాణలో ప్రతిఇంటిలో తెలుగుదేశంపార్టీ, స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబుకు సంబంధించిన జ్ఞాపకాలు
– తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
ఎన్.టీ.రామారావుగారి శతజయంతి ఉత్సవాలనేపథ్యంలో అంగరంగ వైభవంగానిర్వహిస్తున్న మహానాడుకి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. స్వర్గీయ ఎన్.టీ.ఆర్ ఒకశక్తి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీశాలి. తెలుగుప్రజల ఆశలు అడియాశలవుతున్న తరుణంలో నమ్మినప్రజలకోసం తెలుగుదేశంపార్టీని స్థాపించారు.
పెత్తందారీ వ్యవస్థ కబంధహస్తాల్లో నలిగిపోతున్న బడుగుబలహీనవర్గాలు, దళితులకు అండగా నిలిచి, పేదలకు కడుపునిండా తిండి, ఉండటానికిఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండేలా గొప్పపథకాలు తీసుకొచ్చారు.
రూ.2లకే కిలోబియ్యం, జనతావస్త్రాలపంపిణీ, పేదలకుపక్కాఇళ్లు, రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు, మాండలికవ్యవస్థ తీసుకురావడం, పటేల్ పట్వారీ వ్యవస్థరద్దుచేయడ వంటిగొప్ప పథకాలు తీసుకొచ్చారు.చంద్రబాబుగారు పటిష్టమైన నాయకత్వంలో పల్లెలు, పట్టణాలను అభివృద్ధిపథంలో నడిపారు. చంద్రబాబుగారుచేసిన పనులు, ఎన్టీఆర్ రాజకీయల్లో చూపిన చొరవ ఎప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాయి.
తెలంగాణలో మినీమహానాడు, ఇంటింటికీ తెలుగుదేశంకార్యక్రమాలుచేపట్టాం. ప్రజల్లోకి వెళితే చంద్రబాబు చేసిన పనులు కళ్లముందు కనిపిస్తున్నాయి. అవిచూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు అనేకం. ఎక్కడచూసినా, ఏగ్రామానికి వెళ్లినా తెలంగాణలో ప్రతిఇంటిలో తెలుగుదేశంపార్టీ, స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబుగార్లకు సంబంధించిన జ్ఞాపకాలు కనిపిస్తాయి.
క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు చంద్రబాబు, ఆ క్రమశిక్షణతోనే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిచేసి ప్రపంచపటంలో నిలిపారు. మా పిచ్చోడు, ఇక్కడున్న సైకోగానీ ప్రజల్ని భయపెట్టే పనులు చేస్తున్నారుగానీ, వారికిఉపయోగపడే పనులుచేయడం లేదు. పసుపుజెండాలు చేతపట్టి యువతీయువకులు ముందునడిస్తేనే తెలుగురాష్ట్రాలకు, తెలుగుప్రజలకు న్యాయం జరుగుతుంది.