Suryaa.co.in

Andhra Pradesh

పెట్రోల్, డీజిల్ ధరలపై అవినీతి బురద పత్రికలో అబద్దాలు

• రాష్ట్రంలోని రోడ్లు బాగుచేసేందుకే రూపాయి రేటు పెంచినట్టు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు
• గత సంవత్సర కాలంలో దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ‎ పెంచిన ఏకైక‎ రాష్ట్రం ఆంద్రప్రదేశ్ అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పారు. రాష్ట్రప్రభుత్వం గతఏడాదికాలంలో పెట్రోల్ పై రూ. 7.59 డీజిల్ పై రూ. 5.48 ‎పెంచింది
• గడచిని రెండున్నరేళ్లలో పెట్రోల్ డిజిల్ పై రూ.28వేలకోట్లభారం వేసి, జగన్ సర్కారు దేశంలోనేసరికొత్త రికార్డు సృష్టించింది
• దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?
• రేపు టీడీపీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా జరిగే కార్యక్రమాల్లో వాహనదారులు మోగించే సైరన్ల నిరసనధ్వని, జగన్ చెవుల్లో మారుమోగాలి
• మిగతా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుంటే ఏపీలో తగ్గించకుండా ప్రజలపై భారం ఎందుకు మోపుతున్నారు?
• టీడీపీ హయాంలో పెట్రోల్ డీజిల్ పై లీటరుకి రూ. 2 తగ్గించాం, కానీ వైసీపీ ప్రభుత్వం కనికరం లేకుండా ప్రజలపై వేల కోట్ల భారంమోపుతోంది
• పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో టీడీపీ ఆధర్వంలో రేపు జరగబోయే ‎నిరసనకార్యక్రమాల్నిభారీస్థాయిలో జయప్రదం చేసుకుందాం
• దేశంలో అన్నిరాష్ట్రాలు తగ్గించినట్టే, ఏపీలో కూడా ప్రభుత్వం దిగి వచ్చి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించే వరకు పోరాటం చేస్తాం
– టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
నా పునరాగమనం వైఛీపీ పేటీఎమ్ చిల్లరబ్యాచ్ కు నిరుత్సాహాన్ని, తీవ్ర నిరాశానిస్పృహల ను కలిగించే తీరుతుందని, ఇక ఎప్పటికీ పట్టాభి అనేవ్యక్తి తెరపైకిరాడని, తనవాణి వినిపించడని, తన కథముగిసిందని, తాను భయపడి పారిపోయానని, కిందిస్థాయిలోని వైఛీపీ చిల్లరబ్యాచ్ మొదలు పైస్థాయిలో ఉండే ఏ2వరకు అందరూ భావించారని, తనకుటుంబంకోసం తానుతీసుకున్నవిరామాన్ని, వారికి అనుకూలంగా మార్చుకొని మాట్లాడినవారందరికీ వాస్తవాలు బోధపడేలాచేయడానికి ప్రజలకోసం ప్రజలతరుపున, బాధ్యతగల ప్రతిపక్షనేతగాగళం వినిపించడానికి మీడియా ముందుకువచ్చినట్లు టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తేల్చిచెప్పారు.సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ రాష్ట్రప్రజలపై అనేకభారాలు, బాదుళ్లు వేస్తున్నాడు. ఆ కోవలోనే భారీగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు. నిన్నటికి నిన్న అవినీతి బురద పత్రికసాక్షిలో షరామామూలుగా ఉన్నదిలేనట్టు, లేనిదిఉన్నట్టుగాచెబుతూ, ప్రజల్ని మాయచేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ, పూర్తి పేజీ పత్రికాప్రకటన ఇచ్చారు. సదరు ప్రకటన లో పెట్రోల్ డీజిల్ ధరలపెంపునకు సంబంధించి ఏపాపం తమకు తెలియదన్నట్లు, తమకేమీ సంబంధమే లేదన్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని నిన్నగుర్తొచ్చింది ఈ ప్రభుత్వానికి. రోడ్లుబాగుచేయడానికి కేవలం ఒక్కరూపాయి కొద్దిపాటిభారం మాత్రమే పెట్రోల్, డిజిల్ ధరల పెంపుతో ప్రజలపైవేసినట్టు ప్రభుత్వం నిస్సిగ్గు గా బురదపత్రిక లో ఇచ్చిన ప్రకటనలో పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చింది.
పెట్రోల్ డీజిల్ ధరలపెంపుపై రాష్ట్రముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కొన్నిసూటి ప్రశ్నలు అడుగుతున్నాను. మిస్టర్ చీఫ్ మినిస్టర్ తనప్రశ్నలకు ప్రజలకు సమాధానంచెప్పి తీరాల్సిందే. పార్లమెంట్ లో లోక్ సభసభ్యులు అడిగిన ప్రశ్న నెంబర్ 84కు సమాధానంగా, కేంద్రఇంధనశాఖా మంత్రి 26, జూలై 2021న రాష్ట్రాలవారీగా ఏఏ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ లపై గత సంవత్సరకాలంలో ఎంతెంత అదనంగాపెంచిందో చాలా స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ రికార్డుల్లో చూస్తే, ఆయనేంచెప్పారో అందరికీ అర్థమవుతుంది.
కేంద్రమంత్రి సమాధానంప్రకారం దేశంలోనే అత్యధికంగా గతసంవత్సరకాలంలో పెట్రోల్ డీజిల్ పై అత్యధికంగా అదనపు ఆదాయం పొందినరాష్ట్రంగాఆంధ్రప్రదేశ్ నిలిచింది. దేశ పెట్రోలియం శాఖా మంత్రి పార్లమెంట్ సాక్షిగా ఏంచెప్పారో, ఈ రాష్ట్రముఖ్యమంత్రికి అర్థమవుతోందా అని ప్రశ్నిస్తున్నాను.
గతసంవత్సరంకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్ పై రూ.7.59పైసల్ని, డీజిల్ పై రూ.5.48పైసలు అదనపు ఆదాయం పొందినట్టు కేంద్రమంత్రి తెలిపారు. దేశంలో మరే రాష్ట్రమూ గతసంవత్సర కాలంలో ఈస్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలుపెంచి అదనపు ఆదాయంపొందలేదని కేంద్రమంత్రే చెప్పారు.
ఏపీప్రభుత్వం గతసంవత్సరకాలంలో పెట్రోల్ పై రూ.7.59పైసలు,అదనపు ఆదాయం పొందితే, తమిళనాడు ప్రభుత్వం రూ.2.46పైసలు, కర్ణాటక రూ.5.70పైసలు, తెలంగాణ రూ.5.77పైసలు, కేరళ రూ.5లు అదనపు ఆదాయం పొందింది. ఏరాష్ట్రం పెంపుదల చూసినా ఏపీప్రభుత్వంకంటే రూ.2 నుంచి రూ.3లు తక్కువే కనిపిస్తోంది. డీజిల్ పై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత సంవత్సరంకాలంలో రూ.5.48పైసలు పెంచితే, తమిళనాడు కేవలం రూ.1.65పైసలుఅదనపు ఆదాయం పొందింది.
తెలంగాణ రూ.4లు, కర్ణాటక రూ.3.67పైసలు మాత్రమేఅదనపు ఆదాయం పొందాయి. దేశంలోని 36రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏరాష్ట్రం పెంచని విధంగా కేవలం ఒకసంవత్సరంలోనే జగన్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలకు భారీగావడ్డించేసింది. ఎందుకంతలా పెంచారో, పెంపుద్వారా వచ్చిన సొమ్ముని ఏంచేశారో ఈ ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే.
గత రెండున్నరేళ్లలో పెట్రోల్ , డీజిల్ ధరలపై జగన్ రెడ్డి బాదుడు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగానే ఉంది. పెట్రోల్ డీజిల్ పై వేసిన పన్నుల ద్వారా ఏపీ ప్రభుత్వం సమకూర్చుకున్న ఆదాయం 2019-20లో రూ.10,168కోట్లు, 2020-21లో రూ.11,014 కోట్లుగా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే, దాదాపుగా రూ.7వేలకోట్ల రూపాయల భారం మోపింది. కేంద్ర పెట్రోలియం శాఖవారి పీపీఏసీ (పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్) అనే వెబ్ సైట్లో ఏఏరాష్ట్రంలో ఎంతెంత చమురు వినియోగం ఉందనేది కూడా చాలాస్పష్టంగా ఉంది.
మనరాష్ట్రంలో 2020-21లో దాదాపుగా 72లక్షల66వేల మెట్రిక్ టన్నుల పెట్రోలియం ప్రొడక్స్ట్ వినియోగంజరిగింది. లీటర్లలోకి మారిస్తే మనరాష్ట్రంలో ఏటా పెట్రోల్ డీజిల్ కలిపి 500కోట్ల లీటర్ల చమురు వినియోగం జరుగుతోంది. దానిలో దాదాపు 350 కోట్ల లీటర్లవరకు డీజిల్ ఉంటే, 150కోట్ల లీటర్లవరకు పెట్రోల్ ఉంది. ఆలెక్కప్రకారం ఏప్రియల్ నుంచి అక్టోబర్ వరకు చూస్తే, సరాసరిన ప్రతినెలా మనరాష్ట్రంలో 29కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం జరిగింది. ఇప్పుడున్న పన్నులశాతం ప్రకారం ప్రతి లీటర్ డీజిల్ పై రూ.21.50పైసలు రాష్ట్రప్రభుత్వం భారంవేసింది.
దాని ప్రకారం ఈ ఆర్థికసంవత్సరంలోనే ప్రతినెలా పెట్రోల్ డీజిల్ పై రూ.1000కోట్లవరకు ప్రభుత్వం వసూలుచేస్తోంది. అలానే పెట్రోల్ పై అత్యధికంగా లీటర్ కి రూ.29.32 పైసలు వసూలు చేస్తోంది. ఈ రకంగా ఈ రెండున్నరేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు రూ.28వేలకోట్ల రూపాయలను పెట్రోల్ డీజిల్ ధరలపెంపుతో వసూలుచేసింది. ఈ సమాచారమంతా కేంద్ర ఇంధనశాఖామంత్రి పార్లమెంట్లో చెప్పినవివరాలు, పీపీఏసీ వెబ్ సైట్ ద్వారా సేకరించిందే. రూ.28వేల కోట్లను ఈ రెండున్నరేళ్లలో వసూలుచేసిందిచాలక, రోడ్డు సెస్ పేరుతో ప్రతి లీటర్ కి రూపాయి అదనంగా వసూలు చేస్తోంది. దానిప్రకారం ప్రతిసంవత్సరం రూ.500కోట్లవరకు వసూలుచేస్తున్నారు. మొత్తంగా ఈ రెండున్నరేళ్లలో దాదాపుగా రూ.29వేలకోట్లను జగన్ ప్రభుత్వం ప్రజలను పీల్చిపిప్పి వసూలు చేసింది… ఇంకా చేస్తోంది.
పశ్చిమబెంగాల్లో 84లక్షల90వేలమెట్రిక్ టన్నుల చమురువినియోగం ఉంటే, దానిపై ఆ రాష్ట్రానికి 2020-21లో రూ.7,916కోట్ల ఆదాయం వచ్చింది. కానీ ఏపీలో పశ్చిమబెంగాల్ కంటే తక్కువ చమురు వినియోగం ఉన్నాకూడా, రూ.11,014కోట్ల ఆదాయం వచ్చింది. ఆ మొత్తమంతా జగన్ సర్కారు పన్నులరూపంలో వసూలుచేస్తున్నదే. ఏపీకంటే ఎక్కువ వినియోగం ఉన్నరాష్ట్రాలు ప్రజలనుంచి తక్కువ వసూలుచేస్తుంటే, తక్కువ వినియోగం ఉన్న ఏపీలో మాత్రం జగన్ రెడ్డి ప్రభుత్వం పన్నులరూపంలో ఎక్కువ వసూలుచేస్తోంది. అదేవిధంగా హర్యానాలో 98లక్షల53వేల మెట్రిక్ టన్నుల చమురు వినియోగముంటే, రూ.7,923కోట్లు మాత్రమే పన్నులరూపంలో వసూలుచేయడం జరిగింది.
ఆరకంగా ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువచమురు వినియోగం ఉన్నరాష్ట్రాలు, తక్కువ ఆదాయాన్ని పన్నులరూపంలో ప్రజలనుంచి వసూలచేస్తున్నాయని అర్థమవుతోంది. ఈ ముఖ్యమంత్రి దేశంలోనే ఏరాష్ట్రం పెంచని విధంగా, గత సంవత్సరకాలంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారా లేదా? పెట్రోల్ డీజిల్ ధరలపెంపుద్వారా గతరెండున్నరేళ్లలో ఈ ముఖ్యమంత్రి రూ.28వేలకోట్లు వసూలుచేసింది నిజమా..కాదా ?
అన్నిరాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా, ఈముఖ్యమంత్రి ఎందుకు ఇంకాఇప్పటికీ తన వసూళ్లు కొనసాగిస్తున్నాడో సమాధానంచెప్పాలి. ఒకపక్కన లక్షలకోట్ల అప్పులుచేస్తూ, మరోపక్కన వేలకోట్ల పన్నులువేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఎలా పీక్కుతింటున్నాడో, ఏపీవాసులు గుర్తించాలి. మిగతా రాష్ట్రాలకంటే ఏపీలోనే ఎందుకు పేదలపై పెట్రోల్ డీజిల్ భారంవేస్తున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిందే.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లీటర్ పై రూ.2లు తగ్గించారు.ఆనాడు ఆయన తగ్గించిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడానికి ఎన్ని జీవోలు, ఆర్డినెన్స్ లు ఇచ్చిందో ప్రజలకు తెలియదనుకుంటున్నారా?టీడీపీప్రభుత్వం ప్రజలకష్టాలు, బాధలుగుర్తించి వారికి ఉపశమనం కల్పిస్తే, ఈ ముఖ్యమంత్రి వారిపై కనికరంచూపకుండా వేలకోట్లను దండుకుంటున్నాడు. ఇది ఎవరూ కాదనలేని పచ్చి వాస్తవం. తాను లేవనెత్తిన ప్రశ్నలకుఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం సమాధానంచెప్పాల్సిందే.
ముఖ్యమంత్రి సాగిస్తున్న అడ్డగోలు దోపిడీకి నిరసనగా, ప్రజలు పడుతున్న బాధలను గమనించే, టీడీపీ రేపు పెట్రోల్ బంకులవద్ద నిరసనకార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రజలంతా కూడా టీడీపీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని, ప్రభుత్వం కళ్లుతెరిచేలా నినదించాలి. వాహనాదారులు రేపు పెట్రోల్ బంకులఎదుట మధ్యాహ్నం 12 గంటలనుంచి 1 గంటమధ్య నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని వారివారి వాహనాల సైరన్లు మోగించాలి. ఆ ధ్వనిదెబ్బకు జగన్మోహన్ రెడ్డి చెవులకు చిల్లులుపడాలి. పసుపుసైనికులు, ప్రజలు ఏకమైతే ఎలా ఉంటుందో ఈ జగన్ రెడ్డికి అర్థమవ్వాలి.

LEAVE A RESPONSE