Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో డీజీపీ ఉన్నారా? సవాంగ్ చదివింది ఐపీఎస్సేనా?

– ప్రజలకు ఏం చేశారని మీరు ఓట్లడుతారు?
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
ఎయిడెడ్ విలీనాన్ని వ్యతిరేకించిన విద్యార్థినిపై పోలీసుల జులుం చేయడమేంటి? పోలీసుల లాఠీచార్జ్ ను ఖండిస్తున్నాం. అసలు ఏపీలో డీజీపీ ఉన్నారా? సవాంగ్ చదివింది ఐపీఎస్సేనా? రాష్ట్రంలో గంజాయి అమ్మే వారినే బతకనిస్తారా? మీ దుర్మార్గపు పాలనను ప్రశ్నిస్తే బతకనివ్వరా? విద్యార్థుల న్యాయపరమైన డిమాండ్లను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతాం.
రెండున్నరేళ్లుగా ఏపీలో వైసీపీ తుగ్లక్ పాలన కొనసాగుతోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను పీక్కుతింటున్నారు. ప్రజలను భయాందోళనకు గురి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజలకు ఏం చేశారని మీరు ఓట్లడుతారు? ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేయిస్తూ పైశాచికానందం పొందుతున్నారు. సంవత్సరాల తరబడి హింసిస్తున్నారు. ప్రజలపై పన్నులభారం వేస్తూ నడ్డివిరగ్గొడుతున్నారు.
చెత్త మీద పన్ను ఈ వైసీపీ తుగ్లక్ పాలనలోనే చూస్తున్నాం. గతంలో వారి ఆదాయానికి తగ్గట్టు ఆస్తి పన్ను వేసేవారు. నేడు ఆస్తికి విలువ కట్టి దాన్ని బట్టి పన్ను వేస్తున్నారు. ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా? ఆస్తిపన్ను పేరుతో ప్రజలను పీక్కుతింటున్నారు . రూ. 500 ఉన్న పన్నును రూ. 5000 చేసిన మీకు ఓటు అడిగే అర్హత ఎక్కడిది? చెత్తపై పన్ను వేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా చెత్తపై పన్ను ఉందా? నీటిపై పన్ను రూ 200కు పెంచేశారు. పోలవరం పూర్తి చేసి వేల ఎకరాలకు నీరు అందించాలని చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడ్డారు.
72 శాతం పనులు పూర్తిచేశారు. మీరు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయ్యింది. ఇంతవరకూ ఒక్క శాతం పోలవరం ముందుకుసాగలేదు. కనీసం పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం చేతకాని జగన్ రెడ్డికి నీటిపై పన్ను వేసే హక్కెక్కడిది? మీకు బుద్ధి ఉందా? నీళ్లు ఇవ్వడం మీకు చేతకాలేదు. ప్రాజెక్టు ఒక్కటీ పూర్తిచేయడం చేతకాలేదు. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు చంద్రబాబు గారు నాడు మరగుదొడ్లు కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడితే దానిపైనా పన్నువేసే స్థాయికి దిగజారారు మీరు. అన్న క్యాంటీన్ ల ఏర్పాటుతో పేదలకు చంద్రబాబు గారు అన్నం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వారి నోటికాడి కూడు తీసేశారు.
ఈ తుగ్లక్ రెడ్డి అన్న క్యాంటీన్లను మూసేసి పేదల కడుపుకొట్టాడు. అన్న క్యాంటీన్లను అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చేశారు. రూ. 5కి భోజం పెట్టెలేని మీరు ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? చంద్రబాబు గారి హయాంలో ఫైడర్ నెట్ కింద రూ. 149 కే టీవీ, నెట్ సౌకర్యాలు ప్రజలకు అందేవి. మీరేం చేశారు? రూ. 350 చేశారు. కానీ ఒక్క కనెక్షనూ సరిగా పనిచేయదు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు ఎల్ ఈడీ బల్బులను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తే వెలుగులు నింపారు. వాటిని నిర్వహించే సత్తా కూడా వైసీపీ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు.
పన్నుల భారంతో ప్రజల నడ్డి విరగొడుతున్న మీరు ప్రజలను ఏ మోహం పెట్టుకుని ఓటు అడుగుతారు? మాఫియా ప్రభుత్వానికి ప్రజలు త్వరలో చరమగీతం పాడబోతున్నారు. ఎయిడెడ్ విలీనంపై టీడీపీ మొదట్నుంచి వ్యతిరేకత తెలుపుతూనే ఉంది.

LEAVE A RESPONSE