Suryaa.co.in

Editorial

సీపీఎస్‌ యుద్ధంలో ఇక కుటుంబాలు?

– క్లాసు రూముల్లోకి వస్తున్న పోలీసులు
– జిల్లా సరిహద్దుల్లో పోలీసుల చెక్‌పోస్టులు
– అంత్యక్రియలకు వెళ్లినా వదలని వైనం
– వాహనాలు ఇవ్వవద్దంటూ ట్రావెల్స్‌ యజమానులకు హుకుం
– ఉద్యోగులకు ఆహారం అందకుండా మెస్‌, హోటళ్ల మూసివేత
– అణచివేతపై ఉద్యోగుల ఆగ్రహం
– సర్కారు ఎత్తుకు ఉద్యోగ సంఘాలపై ఎత్తు
– సామూహికంగా రోడ్డెక్కనున్న ఉద్యోగ కుటుంబాలు
– కంచాలు, భిక్షాటన, ఆకలికేకలతో వినూత్న నిరసనలు
– దానితో జాతీయ స్థాయికి సీపీఎస్‌ ఉద్యమం
– ప్రభుత్వ ఉక్కుపాదంతో ఉద్యోగ సంఘాల కొత్త వ్యూహం
– సర్కారుకు సీపీఎస్‌ శిరోభారం
( మార్తి సుబ్రహ్మణ్యం)

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ అమలు చేస్తామన్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి హామీని అమలుచేయాలంటూ ఆందోళన నిర్వహిస్తున్న ఏపీ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఇప్పుడు తమcps-jagan
ఆందోళనను కొత్త మార్గం పట్టించేందుకు సిద్ధమవుతున్నాయి. సీపీఎస్‌ అమలు చేయడం కష్టమన్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డెక్కుతున్న ఉద్యోగులపై, ఉక్కుపాదం మోపుతున్న సర్కారుకు షాక్‌ ఇచ్చేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు విజయవాడ వరకూ రాకుండా.. ఎక్కడి ఎక్కడ నిర్బంధాలను అమలు చేస్తున్న సర్కారుకు చర్యలకు ధీటుగా, వినూత్న నిర్ణయం తీసుకోనున్నారు. దానితో సీపీఎస్‌ సమస్యను జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో రోడ్డెక్కనున్న ఉద్యోగులు.. కొత్త తరహాలో సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సీపీఎస్‌ అమలు చేయలేమని, దాని స్థానంలో ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఉద్యోగ సంఘాలు తిరస్కరిస్తున్నాయి. తామేమీ కొత్త డిమాండ్లు చేయడం లేదని, ఎన్నికల సమయంలోcps2 జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీనే అమలు చేయమంటున్నామని ఉద్యోగ సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూన్‌ 1న చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. దీనితో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి, ఉద్యోగ సంఘ నేతలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సీపీఎస్‌ అమలుపై సాధ్యాసాధ్యల గురించి తెలియకుండా జగన్‌ హామీ ఇచ్చారని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఇచ్చిన వివరణను, మంత్రి బొత్స చర్చల సందర్భంగా ఉద్యోగ నేతలకు గుర్తు చేశారు.

అయితే మిగిలిన రాష్ట్రాల్లో సీపీఎస్‌ అమలు చేస్తున్న విషయాన్ని, నేతలు మంత్రి వద్ద ప్రస్తావించారు. అన్నీ విన్న బొత్స.. అవన్నీ ఎక్కువ కాలం అమలుకావని, దానిని అమలుచేస్తే కేంద్రంతో చిక్కులు వస్తాయంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం, ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ అమలుచేయాల్సిందేనని పట్టుపట్టారు.

సీపీఎస్‌ అమలు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా లేదని.. బొత్సతో జరిగిన చర్చల్లో గ్రహించిన ఉద్యోగ సంఘాలు సమావేశం నిర్వహించి, జూన్‌ 1న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి.cps4 మరికొన్ని సంఘాలు మాత్రం, తాడేపల్లిలో సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దీనిని ప్రతిష్ఠగా తీసుకున్న జగన్‌ సర్కారు, ఉద్యోగులు ఎట్టి పరిస్థితిలో విజయవాడకు రాకుండా చూడాలని పోలీసులను ఆదేశించింది. గతంలో మాదిరిగా విఫలమైతే సహించేలేదని పోలీసులను హెచ్చరించింది.

దానితో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి, ఉద్యోగులను జల్లెడ పట్టి వెతకడం ప్రారంభించారు. జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసుస్టేషన్ల వారీగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులనుcps5 పిలిపించి, ఉద్యోగులకు వాహనాలు ఇవ్వవద్దని హెచ్చరించారు. చలో విజయవాడకు వెళ్లే వారికి దారిలో ఆహార సౌకర్యం లేకుండా, మెస్‌, హోటళ్లను మూసివేయాలని హుకుం జారీ చేశారు.

మరోవైపు పోలీసులు స్వయంగా స్కూళ్లకు వెళ్లి మరీ టీచర్లకు నోటీసులు ఇచ్చారు. తమకు తెలియకుండా ఊరు దాటవద్దని బెదిరించారు. టీచర్ల సంఘం నేతలపై అయితే ఆంక్షలు రెట్టింపు చేశారు. అయినా వారిపై నమ్మకం లేక, స్వయంగా పోలీసులను స్కూళ్లకు పంపించి, మఫ్టీలో క్లాసు రూముల్లోనే కూర్చోబెడుతున్న వైనం సోషల్‌మీడియాలో విమర్శలకు గురవుతుతోంది. చివరకు ఉద్యోగులు తమ బంధువుల అంత్యక్రియలకు వెళ్లినా, పోలీసులు వెంటాడుతున్న వైనం వారిలో ఆగ్రహం తెంచుతోంది. స్కూల్లో పిల్లలు ఉండగా.. తమను పోలీసు వాహనాల్లో స్టేషన్లకు తీసుకువెళుతున్న వైనం, ఉపాధ్యాయుల ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లయింది. అసలు తమ స్కూళ్లకు పోలీసులు ఎందుకు వస్తున్నారని విద్యార్ధులు అడుగుతున్న ప్రశ్నలకు, పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేక టీచర్లు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

అటు ప్రభుత్వ నిర్ణయం, ఇటు స్థానికంగా పోలీసుల అణచివేత చర్యలతో ఆగ్రహంతో రగిలిపోతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు.. సర్కారుకు షాక్‌ ఇచ్చే ఓ వినూత్న కార్యక్రమానికి తెరలేపేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే చలో విజయవాడ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ఎత్తును చిత్తు చేసేందుకు.. ఎక్కడికక్కడ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డెక్కి, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కంచాలతో శబ్దాలు చేయడం, భిక్షాటన, ఆకలి కేకలcps3 నినాదాలతో ఉద్యోగ కుటుంబాలు సర్కారు గుండెలల్లో గుబులు పుట్టించేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఉద్యోగుల కుటుంబాలు రోడ్డెక్కి వినూత్న రీతిలో, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. సమస్యను జాతీయ స్థాయిలో దృష్టి మళ్లించాలన్నదే ఉద్యోగుల లక్ష్యంగా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE