– ఆయన రెండో వివాహం చేసుకోవడం తో కుటుంబంలో కొన్నేళ్లుగా అంతర్గత విభేదాలు. వివేకా హత్య తరువాత ఆయన కుటుంబ సభ్యుల తీరు అనుమానాస్పదంగా ఉంది
– ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ కక్షలతో సహకరించిన పరమేశ్వర రెడ్డి, టీడీపీ నేత బిటెక్ రవి
– కోర్టులో పిటిషన్ వేసిన దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ
వైఎస్ వివకానందరెడ్డి హత్య కేసులో ఆయన అల్లుడు/ చిన బావమరిది రాజ శేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలతో పాటు కొమ్మా పరమేశ్వర రెడ్డి, టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైజీ రాజేశ్వర రెడ్డి, నీరుగట్టు ప్రాసాద్ ల పాత్ర ఉంది. వారినీ సీబీఐ విచారించాలి.
వైఎస్ వివకానందరెడ్డి కుటుంబంలో తీవ్ర విబేధాలు ఉన్నాయి.ఆయన షేక్ షమీమ్ అనే మహిళ ను వివాహం చేసుకున్నారు. ఆమెతో ఒక కొడుకును కన్నారు. వారికి రెండు కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వాలని భావించారు. ఈ విషయంపై ఆ కుటుంబంలో తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. కొన్నేళ్లుగా వివేకా భార్య, కుమార్తె, అల్లుడు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన ఒక్కరే పులివెందులలో ఉంటున్నారు.
ఈ కోణంలో సిట్ కేసు దర్యాప్తు చేస్తుండటంతోనే అడ్డుకునేందుకే వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఆ కేసును సీబీఐ కి అప్పగించాలని కోర్టు లో కేసు వేశారు. వివేకానంద రెడ్డి హత్య చనిపోయిన విషయాన్ని ఆయన పీ ఏ కృష్ణా రెడ్డి వివేకా నంద రెడ్డి కుటుంబ సభ్యులకే ముందు చెప్పారు. అక్కడి ఫొటోలు తీసి వారికి వాట్సప్ చేశారు. అవి చూసిన తరువాత కూడా వివేకానంద రెడ్డి పెద్ద బావమరిది అది గుండె పోటు అని టీడీపీ నేత, అప్పటి రాష్ట్ర మంత్రి ఆది నారాయణ రెడ్డికి చెప్పారు. ఆయన ఎందుకు అలా చెప్పారు?
ఇక వివేకానంద రెడ్డి రాసినట్టు చెబుతున్న లేఖ, ఆయన సెల్ ఫోన్ లను పోలీసులకు తాము వచ్చిన వరకూ ఇవ్వొద్దని శివ ప్రకాశ్ రెడ్డి ఆయన పీ ఏ కృష్ణా రెడ్డికి చెప్పారు. ఆ రోజు సాయంత్రం తరువాతే పోలీసులకు ఇచ్చారు. అలా ఎందుకు చేశారు? ఆ సెల్ ఫోన్ లో డాటా ఎందుకు డిలీట్ చేశారు?వివేకా అల్లుడు, పెద్ద బావమరిది రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆశిస్తున్నారు. అది సాధ్యం కాకపోవడంతో పాటు, రూ.2 కోట్ల ఆస్తి కూడా పోతుండటంతో వివేకా నంద రెడ్డి మీద కక్ష పెట్టుకున్నారు.
కొమ్మా పరమేశ్వర రెడ్డి కి వివేకానంద రెడ్డి తో ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు ఉన్నాయి. అందుకే వివేకానంద రెడ్డి రాజకీయ ప్రత్యర్థి, టీడీపీ నేత బిటెక్ రవి తో చేతులు కలిపాడు. వివేకా హత్య కు ముందు రోజే అనారోగ్యం సాకుతో ఆసుపత్రి లో చేరారు. అదే రోజు బిటెక్ రవి తో ఒక హోటల్లో సమావేశమయ్యారు.ఈ అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి. ఈ కేసు తో సంబంధం లేనివారిని సీబీఐ ఉద్దేశ్య పూర్వకంగానే వేధిస్తోంది. అందుకే గతం లో సిట్ నివేదికలను బయట పెట్టాలి.