-ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం లోక్ సభ సీట్లు 25
-టైమ్స్ నౌ సర్వే ప్రకారం వైఎస్ఆర్ సీపీకి వచ్చే సీట్లు 24 -25
అంటే..బీజేపీ, కాంగ్రెస్‌ల తరువాత అత్యధిక లోక్ సభ సీట్లు గెల్చుకునే పార్టీ వైఎస్ఆర్ సీపీ. జాతీయ స్థాయిలో..లోక్ సభలో మూడవ అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ సీపీ నిలవబోతుంది.
చంద్రబాబు-లోకేష్ – పవన్- మీడియా.. కలి-విడిగా వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పటికీ, ప్రజలు నమ్మడం లేదని తాజా సర్వే ద్వారా స్పష్టమవుతోందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు జగన్ సం6ఏమ పథకాలను ఆదరిస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నది వైసీపీ నేతల ప్రశ్న. ప్రజలు విజ్ఞతతో ఓటు వేయబోతున్నారని టైమ్స్ నౌ సర్వే ద్వారా తెలుస్తోంది. అంటే..4 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ది ఆయనకు తిరుగులేని మెజార్టీ కట్టబెట్టబోతుంది. ఇప్పటికే.. అసెంబ్లీలో 175 సీట్లు టార్గెట్ పెట్టుకుని శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం..జగనన్నకు చెబుదాం.. జగనన్న సురక్ష పథకాలు ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేస్తున్నాయి.
ఉదయం 4 గంటలకే.. సూర్యుడు ఉదయించక మునుపే..తలుపు కొట్టి పింఛన్ ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఒక్క జగన్ సారధ్యంలోని ఏపీలోనే సాధ్యమైంది.
ఇక.. గ్రామ, వార్డు సచివాలయాలు..వాలంటీర్ వ్యవస్థ..ఫ్యామిలీ డాక్టర్…అమ్మ ఒడి.. నాడు – నేడు పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి.
4 ఏళ్ల వైఎస్ జగన్ పాలననుప్రజలు మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టే..తిరుగులేని విజయాన్ని వైఎస్ఆర్ సీపీకి కట్టబెట్టబోతున్నారని టైమ్స్ నౌ వ్యాఖ్యానించింది.