– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు, రైతుల ముందు ఈ వేదికపై మాట్లాడే అవకాశం లభించడం సంతోషంగా ఉంది. ఎన్నికల ముందు రాజమండ్రిలో ‘సూపర్ సిక్స్’ హామీలను ప్రకటించాం. ఈ రోజు అనంతపురంలో ఆ హామీలలో 90% పూర్తి చేసుకుని ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సభను నిర్వహిస్తున్నాం.
ఈ హామీల అమలుతో అనంతపురం రైతుల స్థితిగతులు మెరుగుపడ్డాయి, జిల్లా స్వరూపమే మారిందని తెలియజేస్తున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రీ.శే. ఎన్.టి.ఆర్, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అనంతపురం హార్టికల్చర్ హబ్‌గా మారింది.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కియా మోటార్స్ రాకతో ఈ ప్రాంతం ఆటోమొబైల్ హబ్‌గా అభివృద్ధి చెందింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనంతపురంలో ఏరోస్పేస్ పరిశ్రమలను తీసుకురావడానికి కృషి చేస్తోంది త్వరలో ఈ ప్రాంతం ఏరోస్పేస్ హబ్‌గా మారబోతోంది. గత ప్రభుత్వం కేవలం సంక్షేమంపై మాత్రమే దృష్టి సారించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టిని సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తుంది. గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారంతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడంతోనే కాలం గడిపారు.
ఉత్తరాంధ్రలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమరావతిలో వరదలు, రాయలసీమలో రైతుల ఆత్మహత్యలు అంటూ అబద్ధపు ప్రచారాలు చేశారు.
ఈ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ యువ నాయకుడు లోకేష్ గారి యువగళం ఆలోచనలతో, పవన్ కళ్యాణ్ నిస్వార్థ ఆలోచనతో, బీజేపీ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం.