– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
ఇవి గత టిడిపి ప్రభుత్వంలో అన్నదాతలకు ఇచ్చిన రైతురథాలు. యువగళం పాదయాత్ర సందర్భంగా మాలేపాడు శివార్లలో నాకు తారసపడ్డాయి. ఒక్క కొండపి నియోజకవర్గంలోనే 150 ట్రాక్టర్లు అందజేశాం. రైతును రాజుగా నిలపాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారు పనిచేస్తే, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని సైకో ప్రభుత్వం అన్నదాతలను ఉరికంభమెక్కిస్తోంది. ఈరోజు తెల్లవారుజామున కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో వైసిపి సర్కారు వేధింపులు తాళలేక ఎండిఓ కార్యాలయంలోనే గోవిందప్ప అనే రైతన్న ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు రైతు బాంధవుడు? ఎవరు రైతుల పాలిట యమకింకరుడు?!