Suryaa.co.in

Andhra Pradesh

రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది

– దేవినేని ఉమ

విజయవాడ: అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. న్యాయం కోసం 1000 రోజులుగా చేస్తున్నపోరాటం వారి సంకల్పానికి నిదర్శనమన్నారు. లాఠీలు ఝులిపించినా.. దాడులు చేసినా.. భరిస్తూ రైతులు ముందుకు సాగుతున్నారని కొనియాడారు. వెయ్యి కిలోమీటర్ల రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని, మూర్ఖపు ప్రభుత్వం ఇకనైనా కళ్ళుతెరవాలని దేవినేని ఉమ ఆకాంక్షించారు.
కాగా రాజధాని రైతుల పోరాటానికి నేటికి వెయ్యి రోజుల ఉద్యమం సందర్భంగా సోమవారం నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైంది. అమరావతి టూ అరసవెల్లికి రైతుల మహాపాదయాత్ర చేయనున్నారు. 900 కిలోమీటర్లకు పైగా మహాపాదయాత్ర సాగనుంది. 60 రోజుల పాటు జరిగేలా పాదయాత్రకు రూపకల్పన చేశారు. 12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగనుంది.

LEAVE A RESPONSE