– హిరమండలం రిజర్వాయర్ ను పరిశీలించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు
వరి విషయంలో ఆంధ్రా పాలకులు కూడా తెలంగాణ ప్రభుత్వం అడుగులో అడుగులేస్తున్నారు. గతంలో వరి వేస్తే ఉరేనంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా.. ఇప్పుడు ఏపీ ధర్మాన ప్రసాదరావు కూడా రైతులను వరి వేయకుండా కమర్షియషల్ క్రాప్ వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. మంత్రి పదవి చేపట్టిన తరావత తర్వాత తొలిసారిగా శ్రీకాకుంళ జిల్లాకు వచ్చిన ధర్మాన వరి వేయవద్దని రైతులను కోరారు.
ధర్మాన ఏమన్నారంటే.. ఇప్పటివరకూ సుమారు 2000 కోట్లు ఖర్చు చేసాం.ప్రాజెక్టు పూర్తి జరిగితే పొందాల్సిన ప్రయోజనాలు రైతులకు అందలేదు. ఒడిస్సా తో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ట్రిబ్యునల్ పై ఒడిస్సా కోర్ట్ కు వెళ్లనున్నట్లు సమాచారం ఉంది. ప్రాజెక్ట్ అనుభవిస్తున్న మనకు ఉన్నంత శ్రద్ధ, ఒడిస్సాకు ఉండదు. అభ్యంతరాలన్నీ పూర్తి కావాలంటే మరో ఐదేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నాం.
గొట్ట దగ్గర ఒక లిప్ట్ పెట్టి, మన హిరమండలం ప్రాజెక్ట్ నింపితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నాం. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు, ఆయన సానుకూలంగా పరిశీలిస్తున్నారు. గొట్టా వద్ద ఎత్తిపోతల పధకానికి 300, 350 కోట్ల అదనపు ఖర్చు అవుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం నిండాలంటే ఎత్తిపోతల అవసరం ఏర్పడింది.
వరి పంటకు రైతులు దూరం కావాలి. రైతులు కమర్షియల్ క్రాప్స్ కు మారిపోవాలి. కృష్ణా, గోదావరి జిల్లాలు అభివృద్దికి నీరే ప్రధానం. ఒడిస్సా తగాదా దురదృష్టకరం . వంశధార ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావలసింది. వైసీపీ హయాంలో రైతులకు వంశధార ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తాం. వచ్చే వేసవి నాటికి 2లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
రిజర్వాయర్ నీటిని నిల్వచేయడం ద్వారా నాగావళి , వంశధార అనుసంధానం చేయవచ్చు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తిత్లీ తుఫాన్ , వంశధార నిర్వాసితులకు అధనపు ప్యాకేజీ త్వరలోనే సిఎం జగన్ అందజేస్తామన్నారు. వరికి రైతులు దూరంగా జరగాలి. వరికి పెడ్టుబడి కూడా రావడం లేదు. ఇతరపంటలు వే సేందును రైతులు ముందుకు రావాలి. పదవీ బాధ్యతలు చేపట్టాక మొదటి కార్యక్రమానికి వచ్చాం. నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి. ఇల్లు , రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. త్వరలోనే సీఎం చేతులమీదుగా కాట్రగడ్డ బ్యేరేజ్ కు పౌండేషన్ స్టోన్ వేస్తాం.