Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి నుంచి అరసవిల్లి వరకు రాజధాని రైతుల పాదయాత్ర

  • మరో పాదయాత్రకు సిద్దమైన రాజధాని రైతులు
  • సెప్టెంబర్ 12 నాటికి అమరావతి ఉద్యమం వెయ్యి రోజుల పూర్తి
  • అదే రోజున పాదయాత్ర ప్రారంభం
  • ఐకాస విస్తృత స్థాయి సమావేశం

అమరావతి రైతుల ఉద్యమం మరో మలుపు తిరగనుంది. జగన్‌ సర్కారు అనుసరిస్తున్న అమరావతి వ్యతిరేక విధానాలపై రోజుకో రకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించిన రైతులు ఈసారి మరోamara4 మహాపాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతంలో అమరావతి టు తిరుమలకు పాదయాత్ర చేసిన అమరావతి రైతులు, ఈసారి అరసవిల్లి వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇందులో వేలాదిమంది రైతులు పాల్గొనే ప్రణాళిక ప్రారంభమయింది.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో రాజధాని రైతులు మరో పాదయాత్రకు సిద్ధమయ్యారు.ఈ సారి అమరావతి నుంచి అరసవిల్లి వరకు పాదయాత్ర చేసేందుకు అమరావతి ఐకాస నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో పాదయాత్ర ప్రతిపాదనను సభ్యులంతా ఆమోదించారు.

సెప్టెంబర్ 12 నాటికి అమరావతి ఉద్యమం వెయ్యి రోజుల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అదే రోజున పాదయాత్ర ప్రారంభిస్తామని స్టీరింగ్ కమిటీ వెల్లడించింది.అమరావతి ఆవశ్యకతను మరోసారి ఇతరamara2
ప్రాంతాలకు తెలియజేసేందుకు సిద్ధమని అమరావతి రైతులు ఉద్ఘాటించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు అరసవిల్లి పాదయాత్రకు సిద్ధమయ్యారు.

amara3రాజధాని నుంచి పాదయాత్ర చేయాలన్న ప్రతిపాదనను స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆమోదించారు. అమరావతి ఉద్యమం ప్రారంభించి సెప్టెంబర్ 12 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా అదే రోజున పాదయాత్ర ప్రారంభించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. గతంలో తిరుమలకు పాదయాత్ర చేసినందున.. ఈసారి అమరావతి నుంచి అరసవిల్లి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. రాజధాని ప్రాంతం నుంచి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ఉత్తరాంధ్ర వరకూ పాదయాత్ర చేసినట్లు అవుతుందన్నారు. పాదయాత్ర విషయంలో సభకు హాజరైన వారంతా ఆమోదం తెలిపారు.గతంలో ఐకాస కన్వీనర్గా ఉన్న పువ్వాడ సుధాకర్ పాదయాత్ర ప్రారంభం విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజుల సందర్భంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించటం బాగుంటుందని సూచించారు. హైకోర్టు తీర్పు అమరావతికి అనుకూలంగా వచ్చిన తర్వాత పాదయాత్ర చేసే విషయంలో కూడా సరైన ఆలోచన చేయాలన్నారు. పాదయాత్ర విషయంలో అందరూ సహకరించాలని సీనియర్ నాయకులు బెల్లంకొండ నరసింహరావు కోరారు. అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రైతులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి నేతలతో పాటు.. లీగల్ కమిటీ, మహిళా ఐకాస, దళిత ఐకాస నేతలు, దీక్షా శిబిరాల నిర్వాహకులు, రైతులు, మహిళలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

అమరావతి నుంచి అసరవల్లి పాదయాత్ర: అమరావతి పరిరక్షణ సమితి కన్వినర్ ఏ శివారెడ్డి
అమరావతి పరిరక్షణ సమితి , రైతు ఐక్యకార్యాచరణ సంయక్తంగా అమరావతి నుంచి అసరవల్లి పాదయాత్రను రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు , రాజధానిని కాపాడుకునేందుకు నిర్వహిస్తున్నామని కన్వినర్ ఏ శివారెడ్డి వెల్లడించారు . ఐరా హొటల్ లో జరిగిన విలేకరుల సమవేశంలో అయన మాట్లడుతూ 975 రొజులు అమరావతిని ఆకాక్షించే వారి ఉద్యమం కొనసాగింది . ఈ అవినీతి ప్రభుత్వం , ఈ తుగ్లక్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ పొరాటం కొనసాగుతుంది . న్యాయస్థానాల తీర్పులు అమరావతి కి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాలు అమోదయోగ్యం కాదు . అమరావతి రాజదాని లేకపొతే రాష్ట్రానికి భవిశ్యత్తు లెదు . రాష్ట్రన్ని మూడురాజధానులంటూ ప్రజల్ని విభజించి పాలించే ప్రయత్నాలు మానుకోవాలి . అన్నిరాజకీయ పార్టీలు అమరావతి ని ఆమోదిస్తుంటే వైసిపి ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంbది . అమరావతి అభివృద్ధితోనే అన్నీ రంగాలలో అభివృద్ది జరుగుతుంది .

ఈ ప్రభుత్వన్ని మెడలు వంచుతాం , గద్దే దించుతాం . అనేక కేసులు నమోదైన తాము పాదయత్రని నిర్వహించం . ఇప్పుడు అమరావతి నుంచి అరసవెల్లి కి పాదయత్రని వచ్చేనెల 12 నుంచి ప్రారంభిస్తాము . పాదయత్రని జయప్రదం చెయ్యడానికి అన్ని ప్రాంతాలవా6రు సహకరించాలి ,కలిసి రావాలని శివారెడ్డి పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో ఐక్యకార్యాచరణ సమితి నాయకులు ధనేకులు రామారావు , మేళం భాగ్యారావు , స్వరాజ్యరావు , మార్టిన్ , ఉమా , రాయపాటి శైలజ , గద్దే తిరపతి రావు తదితరులు ప్రసంగించారు .

LEAVE A RESPONSE