Suryaa.co.in

Andhra Pradesh Telangana

రైతులు కేసీఆర్ పాలన పై తిరగబడండి

– హక్కులు అడిగితే జుట్టు పట్టుకొని లాక్కెళ్తారా?
– కేవలం ఎకరాకు 5 వేలు ముస్టి ఇస్తున్నారు
– వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

మనం ఈ దేశం లోనే భాగంగా ఉన్నామా? లేక పాకిస్థాన్ ,ఆఫ్ఘనిస్తాన్ లో భాగం గా ఉన్నామా? ప్రజల కష్టాలు చూస్తుంటే ఎక్కడ ఉన్నామో అర్దం కావడం లేదు.వైఎస్సార్ బ్రతికి ఉంటే పోడు భూములకు పట్టాలు దక్కేవి. ఈ పాలకులకు ఎస్సీ లు,ఆదివాసీలు మనుషులుగా కనిపించడం లేదు.

మా భూములు మాకు ఇవ్వని నెత్తి నోరు బాదుకుంటున్నారు. పట్టాలు ఇవ్వక పోగా ఉన్న భూములు లాక్కుంటారా?ఎన్నికలప్పుడు పోడు భూముల సమస్య ఉందని కేసీఆర్ చెప్పలేదా? కుర్చీ వేసుకొని కూర్చొని పరిష్కారం అని చెప్పలేదా?
కేసీఆర్ ఎందుకు రాలేదు మరి ? కేసీఆర్ కి చేత కావడం లేదా? హక్కులు అడిగితే జుట్టు పట్టుకొని లాక్కెళ్తారా? నష్ట పోయిన కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు. మీరు వాగ్దానం ఎందుకు చేశారు. ఇప్పుడు చేస్తుంది ఏమిటి? 6 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తే లాక్కోవడం దారుణం. దళితులకు 10 లక్షలు ఇస్తామని ఇచ్చారా? 3 ఎకరాల భూమి విలువ ప్రస్తుతం 51 లక్షలు.భూమి ఇవ్వండి లేకుంటే 10లక్షలు కలిపి 61 లక్షలు ఇవ్వండి.

టీఆర్ఎస్ నేతలు వేస్తే కాలర్ పట్టుకొని అడగండి. 61 లక్షలు ఇస్తేనే వదిలి పెట్టండి. వ్యవసాయం,రైతులు తెలంగాణ లో బంది అయ్యారు. నచ్చిన పంట కూడా వేసుకొనే హక్కు లేదు. .వ్యవసాయానికి కరెంట్ కట్ లు చేస్తున్నారు. 25 వేలు ఇచ్చే పథకాలను బంద్ పెట్టీ.. కేవలం ఎకరాకు 5 వేలు ముస్టి ఇస్తున్నారు.
రైతు బందు గొప్పగా ఇస్తూ కోటీశ్వరులు చేశా అని గొప్పలు చెప్పుకుంటున్నారు. . రైతులకు కేసీఆర్ చేస్తోంది పెద్ద ద్రోహం.. కౌలు రైతులను కేసీఆర్ మనుషులుగా కూడా చూడటం లేదు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అవుతాడు అని అనుకోలేదు.. కేసీఆర్ పోవాలి వైఎస్ పరిపాలన రావాలి. వైఎస్సార్ సంక్షేమ పాలన తెలంగాణ లో రావాలి.

పథకాలతో లబ్ది చేకూర్చే వైఎస్సార్ లాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనకు కావాలి.
రైతులు కేసీఆర్ పాలన పై తిరగబడండి. అధికారమిస్తే వ్యవసాయాన్ని పండుగ చేస్తా.వైఎస్సార్ బిడ్డ గా మాట ఇస్తున్న.

 

LEAVE A RESPONSE