-రైతుల కు ఉదారంగా ఆర్ధిక సహకారం అందించాలి
-తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి
-ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్ధిక సహకారం మంజూరు చేయాలి
-అసైన్డ్ భూముల్లో సాగు చేసిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలి
-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్
విజయవాడ.. మిచౌంగ్ తుఫాన్ కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయారు ఆహారాధాన్యాలతో పాటు ఉద్యానవన పంటలతో సహా పలు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. అయితే భీమా చేసిన రైతాంగం ఎంతమంది లేనివారు ఎంతమంది అనే గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో పెట్టక పోవడం వల్ల రైతాంగం ఆందోళన చెందే పరిస్ధితిలు ప్రస్తుతం నెలకొన్నాయి ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.
వరి సాగు చేతికి అందుతున్న దశలో తుఫాన్ వల్ల పూర్తి నష్టం సంభవించింది. ఎకరాకు సుమారుగా 40వేలు పెట్టుబడి పెట్టిన తరువాత పంట ఇంటికి రాదు అని తెలిసిన తరువాత రైతు పడే బాధను రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధం చేసుకుని పూర్తి స్ధాయి పెట్టుబడి సాయం అందించడం తో పాటు రంగు మారిన ధాన్యం, తడిసిన ధాన్యం కూడా పంట పొలాల వద్దే ప్రభుత్వం మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలి . పంట నష్టం అంచనాలు ను 48 గంటల్లో యుద్దప్రాతిపదికన తేల్చి తక్షణ సాయం అందించాలి.
తుఫాన్ కారణంగా సన్న, చిన్నకారు రైతాంగం పూట గడవని పరిస్ధితి ఎదుర్కొంటున్నారు. కౌలు రైతులు పరిస్ధితి మరీదారుణంగా ఉంది. వరి పంట పూర్తిగా తడిసి ముద్దైంది ప్రస్తుతం ఈ ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి ప్రభుత్వం తాత్సారం చేయకుండా ఈవిషయంలో స్పష్ట మైన ప్రకటన చేయాలని బిజెపి రాష్ట్ర అద్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఉద్యాన వన పంటలు కు సంబందించి వెదర్ బేస్ డ్ క్రాప్ ఇన్సూరెన్స్ పరిధిలోకి టమోటా, అరటి వంటి పంటలు కూడా తీసుకుని రావడం జరిగింది అయితే ఇంత వరకు ఉద్యాన వన పంట రైతుల నష్టం వివరాలు ప్రభుత్వం తేల్చాలి అంటే 48 గంటల్లో పంట నష్టపోయిన ప్రాంతాలకు అధికారులు వెళ్లి నష్టం అంచనాలు వేయాలి. అరటి పంట చేతికి అందుతున్న దశలో తుఫాన్ వల్ల అరటి రైతులు ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాల్లో నష్ట పోయారు, ఎకరా అరటి పంటకు సుమారుగా లక్ష పెట్టుబడి పెట్టిన పరిస్ధితి ఈ దశలో నష్ట పోయారు . మొత్తం ఉద్యానవన పంట సాగు రైతాంగాన్ని ఆదుకోవాలంటే వెంటనే పంటనష్టం అంచనాలు రెండు రోజుల్లో పూర్తి చేయాలి.
అదేవిధంగా ఎసైన్డ్ భూముల్లో పంట ఆన్ లైన్ చేయని కారణంగా వారికి నష్ట పరిహారం ఏవిధంగా అందించాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వరి వ్యవసాయానికి సంబందించిన రైతుల భీమా విషయంలో కూడా భీమా వర్తించని వారికి కూడా కౌలు రైతుగా గుర్తించి సాగు దారునికి పూర్తి స్ధాయిలో ఆర్ధిక సహకారం అందించాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.
పునరావస కేంద్రాల్లో ఉన్న వారికి నాణ్యమైన భోజన అందించడం తో పాటు తుఫాన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో ఆరోగ్యపరమైన రక్షణ చర్యలు చేపట్టాలి. రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉదార శీలి వైఖరి అవలంభించాలని కోరారు. బిజెపి శ్రేణులు కు సేవా రంగానికి పెట్టింది పేరు అదేవిధంగా ప్రస్తుతం తుఫాన్ బాధితులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.కరొనా సమయంలో బిజెపి శ్రేణులు అందించిన సహకారం రాష్ట్ర ప్రజలు మరువ లేదు.
ఇప్పటికే తుఫాన్ బాధిత ప్రాంతాలకు బిజేపి శ్రేణులు చేరుకుని సహకారం అందిస్తున్నారు.ఇదే సహ కారం మరో రెండు రోజులు కొనసాగించాలని కోరారు. తుఫాన్ కారణంగా నేలమట్టం అయిన పూరిళ్ళ ను ప్రభుత్వం వెంటనే నిర్మించి వారికి అందించాలని ఆ ప్రకటన లో కోరారు.