Suryaa.co.in

Andhra Pradesh

శరవేగంగా బల్క్ డ్రగ్ పార్క్ పనులు

ఎంపీ విజయసాయిరెడ్డి

మే,26: కాకినాడ పమీపంలోని తొండంగి మండలంలో కేపి పూరం,కోదండ గ్రామాల మధ్య రూ.1000 కొట్లతో బల్క్ డ్రగ్ పార్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ కాంగ్ర్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.
16 రాష్ట్రాలతో పోటిపడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెండర్ ద్వారా పార్కుని దక్కించుకుని, ఏపీ బల్క్ డ్రగ్స్ ఇన్ర్ఫా కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసిందన్నారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రూ.14,340 కోట్ల పెట్టుబడులు,అలాగే 30 వేల మందికి ఉపాది లభిస్తుందన్నారు.సొషల్ మీడియా వేదికగా ఆయన పలు అంశాలపై స్పందించారు.

ఉద్యోగాల వెల్లువ
గ్రూప్ -1,గ్రూప్-2 సంబందించి మొత్తం 1,000 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిదని చెప్పారు. గ్రూప్-1లో 100 పోస్టులు, గ్రూప్-2లో 900 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పెర్కోన్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయగా,ఎంఎస్ఎంఈల్లో 20 లక్షల మందికి పైగా ఉపాది కల్పించారని పెర్కొన్నారు.

అమరావతిలో పేదలకు ‘పట్టా’భిషేకం
అమరావతి సీఆర్డీయే పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాల పంపిణీతో పాటు, సీఆర్డీయే ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు సీఎం వైయస్‌.జగన్‌ శుక్రవారం అందజేశారని విజయసాయిరెడ్డి తెలిపారు.

LEAVE A RESPONSE