– డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను కోరారు. సితాఫలమండీ మునిసిపల్ డివిజన్ పరిధిలో దాదాపు రూ. 80 లక్షల ఖర్చుతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ బుధవారం స్థానిక కార్పొరేటర్ కుమారి సామల హేమ, అధికారులు, నేతలతో కలిసి ప్రారంభించారు.
బీదల బస్తే లో రూ.37 లక్షలతో సీ సీ రోడ్డు నిర్మాణం పనులు, దాదాపు రూ.10 లక్షలతో కమ్యునిటీ హాల్ నిర్మాణం పనులు, మహమ్మద్ గూడా లో రూ.19 లక్షలతో నాలా ప్రహరీ నిర్మాణం పనులు, ఏక్ మినార్ మసీద్ సమీపంలో రూ.9.50 లక్షలతో మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బల్దియా, జలమండలి ద్వారా సికింద్రాబాద్ కు పుష్కలంగా నిధులను సమకూర్చి అభివృద్ధి లో ప్రధమ స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు. రోడ్ల పునర్నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ అయన అధికారులను ఆదేశించారు. జలమండలి డీ జీ ఎం కృష్ణ, అధికారులు అన్విత్ కుమార్, కౌశిక్ కుమార్, నవ్య. బీ ఆర్ ఎస్ నేతలు రామేశ్వర్ గౌడ్, కరాటే రాజు తదితరులు పాల్గొన్నారు.