-100వ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన ఎన్టీఆర్ కు 27 ఏళ్ల క్రితమే నూరేళ్లూ నిండేలా చేసిన చంద్రబాబు
-మహానాడులో తొడలు కొట్టిస్తూ, బూతులు మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఉన్మాది చంద్రబాబు
-సామాజిక న్యాయ భేరి యాత్రకు ఉప్పెనలా తరలివస్తున్న జనం
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి
వందో పుట్టినరోజు జరుపుకోవాల్సిన తారక రాముడికి ఊహించని విధంగా వెన్నుపోటు పోడిచి,27 ఏళ్ల క్రితమే నూరేళ్ళూ నిండేలా చేసి, దండ వేసిన వేసిన చంద్రబాబు, ఇప్పుడు ఆయన వందో పుట్టిన రోజు సందర్భంగా దొంగ నమస్కారం పెడుతుండడం చూసి తెలుగు జాతి యావత్తూ ఛీ ఛీ అంటోందని, రాజ్యసభ సభ్యులు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు.
మహానాడు పేరుతో పెయిడ్ ఆర్టిస్టుల చేత తొడలు కొట్టిస్తూ, వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు నటిస్తూ కామెడీ పండిస్తున్న నాయుడు బాబుకు, టీడీపీకి జనం 2024 లో తప్పక తొడపాశం పెడతారని,మగవాళ్లతో పాటు మహిళలతోనూ బూతులు మాట్లాడిస్తూ ఉన్మాది చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నాడని అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి మహానాడుకు డ్రామా కంపెనీగా మార్చేశారని, ఊరు పేరు లేని కిరాయి వ్యక్తులతో అసభ్యకర వ్యాఖ్యలు చేయించే స్థాయికి దిగజారిపోయారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పటికీ ఈ బలహీనత నుంచి బయటపడలేడని, తనను తోపు, గడ్డిమోపు అని పొగిడితే పరవశించిపోతాడని అన్నారు. చిత్తుగా ఓడించి కాంతి సంవత్సరాల దూరం తరిమికొట్టినా బాబుకు బుద్దిరాలేదని, పతనమైన వ్యక్తులు విచక్షణ కోల్పోయి ఉన్మాదుల్లా మారుతారనడానికి చంద్రబాబు ఉదాహరణని అన్నారు.
వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘సామాజిక న్యాయ భేరి’ బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలి వచ్చి మద్దత్తు తెలియజేస్తున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ చేసిన, చేస్తున్న సామాజిక న్యాయాన్ని ఆయా వర్గాల వారు గుర్తించి, ‘సామాజిక న్యాయ భేరి’ని ఆడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.