ప్రజా పోరుతో రాష్ట్ర ప్రభుత్వంపై సమరభేరి

– రాష్ట్రవ్యాప్తంగా అయిదువేల సభలు నిర్వహించేందుకు అవసరమైన ప్రచార రధాలను రాజమహేంద్రవరంలో లాంఛనంగా ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

రేపు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన. వేడుకలు నుండి అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వరకు బిజెపి ప్రజా పోరు. ప్రధానంగా నాలుగు అంశాలను కేంద్రం గా చేసుకుని కార్యక్రమాలు పెట్టాం.రాష్ట్రం లో మెగా రక్తదాన శిబిరాలు,రోగులకు మందులు,పండ్లు పంపిణీ.

అమృత సరోవర్ అంటే చెట్లు నాటే కార్యక్రమం, వోకల్ ఫర్ లోకల్ పేరుతో సేంద్రీయ ఉత్పత్తులు స్టాల్స్ ను ప్రోత్సహిచడం.మోడీ పరిపాలన,సంక్షేమ పధకాల పై ప్రచార కార్యక్రమాలు,మోడీ పాలన, జీవితాల పై ఆర్టికల్స్ ప్రచురణ.సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ రెండు వరకు ఐదు వేల బహిరంగ సభలు నిర్వహిస్తాం.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జాతీయ,రాష్ట్ర నేతలు, కేంద్ర మంత్రులు అగ్రశ్రేణి నాయకులు ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సభల్లో మాట్లాడేలా ప్రణాళిక. ప్రజా పోరు ద్వారా మోడీ అభివృద్ధి,జగన్ అవినీతి ని వివరిస్తామంటున్న బిజెపి నాయకులు

Leave a Reply