– విశాఖ ఉక్కు కోసం పోరాడండి
– పోలవరం తొందరగా పూర్తి చేసి కాళేశ్వరం లాగా నీళ్లు అందించండి
– సిద్దిపేట ఆత్మీయ సమ్మేళనంలో
కొందరు నాయకులు ఎగిరెగిరి పడుతున్నరు.ఉన్నది అంటే ఉలిక్కి పడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదు?విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాటం లేదు? పోలవరం పనులు ఎందుకు కావడం లేదు అన్న.ఇందులో ఏమైనా తప్పుందా?
ప్రజల పక్షాన మాట్లాడాను తప్ప.. ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదు. తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అని చెప్పాను. ఏపీ ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండాలి అని చెప్పిన. మేము ఏపీ గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు.
తెలంగాణలో అన్ని బాగున్నాయి. ఇక్కడే ఉండండి అనీ ఆరోజు అన్నాను. కానీ ప్రజల్ని, ఏపీని కించ పరచే విధంగా మాట్లాడాను అని కొందరు నాయకులు అనడం, అది వారి విజ్ఞతకు వదిలేస్తున్న. అడిగినదానికి సమాధానం చెప్పలేక ఇలాంటి మాటలు. చేతనైతే జాతీయ హోదా కోసం పోరాడండి. విశాఖ ఉక్కు కోసం పోరాడండి. పోలవరం తొందరగా పూర్తి చేసి కాళేశ్వరం లాగా నీళ్లు అందించండి.