– నిరాధార ఆరోపణలు చేస్తాం.. బురద జల్లుతాం కడుక్కోండి అంటే వదిలేయాలా?
– పాదయాత్రకు ముందున్న లోకేశ్ వేరు… ఇప్పుడున్న లోకేశ్ వేరు
– నాపై, నాకుటుంబంపై విషప్రచారం చేసిన వాళ్లను వదిలిపెట్టను
-తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిపై వేసిన కేసుల్లో భాగంగా నేడు మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన అనంతరం, విలేకరులతో మాట్లాడిన టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ఒక నియంత, పెత్తందారుపై నేను పోరాడుతున్నాను. వైసీపీ గోబెల్స్ పై పోరాడుతున్నాను. అడుగడుగునా నాపై నిరాధార ఆరోపణలు చేయడం.. నిరూపించమంటే తోక ముడవడం వైసీపీవారికి బాగా అలవాటైంది. అందుకే న్యాయంకోసం న్యాయస్థానాల్ని ఆశ్రయించాను. జగన్ లాగా అవినీతికి పాల్పడి శిక్షలనుంచి తప్పించుకోవడానికి నేను కోర్టులకు వెళ్లడంలేదు.
నేను విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్, వీసీ ఉంటే చాలు.. కానీ జగన్ విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలతోపాటు, కోర్టుల అనుమతి కావాలి. జగన్ అవినీ తిని, క్విడ్ ప్రోకో పద్ధతిలో చేసిన దోపిడీని మేం ఆధారాలతో సహా బయట పెట్టాం. ప్రజలసొమ్ము కొట్టేసి, దాన్ని ఎటునుంచి ఎటు మళ్లించి, తిరిగి తనఖజానాకు చేరేలా చేశాడో కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాం. న్యాయస్థానాల ముందు రుజువు చేశాం. దాంతో ఆయన 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు.
వైసీపీ వాళ్లైనా…ఇతరులైనామీడియాసంస్థలైనాఎవరైనా సరే, విషప్రచారం చేస్తాము.. బురదజల్లుతాము అంటే ఊరుకోను… ఎవరినీ వదిలిపెట్టను. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, వైసీపీనేతలు నాపై అనేక ఆరోపణలు చేశారు.. ఇప్పటికీ చేస్తున్నారు. వారు చేసిన ఆరోపణల్లో మొదటిది పింక్ డైమండ్.. అలానే రూ.6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డామని, ఫైబర్ గ్రిడ్ లో కుంభకోణానికి పాల్పడ్డామని, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో కుంభకోణమని, ఆస్తి తగాదా వల్ల మా పిన్ని చనిపోయారని, మంత్రిగా ఉన్నప్పుడు నేను ఐటీకంపెనీలకు ఇచ్చిన ఇన్సెంటివ్ ల్లో కూడా అవినీతి జరిగిందన్నారు.
విశాఖపట్నం విమానా శ్రయంలో ఏకంగా నేను ఒక్కడినే రూ.25లక్షల ప్రజలసొమ్ముని చిరుతిళ్లకోసం ఖర్చుపెట్టానని నీతిమాలిన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా నాపై, నా కుటుంబంపై నీచాతినీచంగా వ్యక్తిగత ఆరోపణలు చేశారు. దారుణాతిదారుణంగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. ఇలా బరితెగించి ప్రవర్తించినవారినెవ్వరి నీ వదిలిపెట్టను. నాపైన, మాపార్టీపైన, మా నాయకుల పైన ఇంతకుముదు చేసినట్టు నిరాధార ఆరోపణలుచేసి, నీతిమాలిన విషప్రచారం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు.
గతంలో లాగా అలా చేసేవారిని వదిలేస్తామనుకుంటే అంతకం టే మూర్ఖత్వం మరోటి ఉండదని హెచ్చరిస్తున్నా. వైసీపీవాళ్లైనా, ఇతరులైనా, ఎలాంటి ప్రసారమాధ్యమాలైనా ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని నిరూపిం చాలని సవాల్ చేస్తున్నా.
యువగళం పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి ని నేను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నాను. అది మాపార్టీ ద్వారా నేను నేర్చుకున్న చిత్తశుధ్ధి..క్రమశిక్షణ. నాపై, నాకుటుంబంపై, మా పార్టీపై విషప్రచారం చేసే వ్యక్తులతో పాటు, మీడియా, సోషల్ మీడియాను కూడా వదిలపెట్టను.
నా తాత, తండ్రి 22ఏళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నా.. ఎప్పుడూ ప్రజా ధనం జోలికి వెళ్లలేదు..హద్దులు మీరి ప్రవర్తించలేదు రాజశేఖర్ రెడ్డి 6ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి లక్షకోట్లకు పైగా ప్రజాధనాన్ని లూఠీ చేశాడు. మా తాత గారు, తండ్రి దాదాపు 22 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ ఏనాడు నేను హద్దులుమీరి ప్రవర్తించలేదు.
ప్రజాధనం జోలికి వెళ్లడం.. ప్రజ ల్ని ఇబ్బంది పెట్టడం చేయలేదు. అదీ మాకున్న క్రమశిక్షణ. అలానే ప్రతి ఏటా మా ఆస్తులు ప్రకటిస్తున్నాం. నిజంగా నేను తప్పుచేస్తే మొదట నన్ను జైలుకు పంపేది నా తండ్రేనని గర్వంగా చెప్పగలను. సమాజహితం, ప్రజలకోసం పనిచేసే కుటుంబం మాది. వైసీపీ నేతలు, ఆ పార్టీకి అంటకాగే కొందరు తప్పుడు మను షులు నాపై చేసిన నిరాధార ఆరోపణలు రుజువు చేయాలని, లేకుంటే చట్టపరం గా శిక్షించాలని కోరుతూ న్యాయస్థానాల్ని ఆశ్రయించాను.
పోసాని కృష్ణమురళి సమాధానం చెప్పేవరకు వదిలిపెట్టను. నాకు 14 ఎకరాల భూమి ఉంటే ప్రభుత్వం దానికి సంబంధించిన ఆధారాలు ఎందుకు బయటపెట్టదు? గతంలో వైసీపీనేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఒక టీవీ ఛానెల్లో మాట్లాడుతూ, కంతేరు వద్ద నాకు 14 ఎకరాల భూమిఉందని చెప్పారు. అప్పుడే ఆయనకు నేను లీగల్ నోటీసులు పంపాను. రెండుసార్లు నేను పంపిన లీగల్ నోటీసుల్ని ఆయన స్వీకరించకుండా తిరస్కరించారు.
ఎందుకు తిరస్కరించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఎవరో విసిరే బిస్కట్లకు ఆశపడి, ఇష్టమొచ్చినట్టు మీరు బురదజల్లితే మేం తుడుచుకోవాలా అని ప్రశ్నిస్తున్నా. 14 ఎకరాలు నాకుంటే, ప్రభుత్వంలో ఉన్న వీళ్లు దానికి సంబంధించిన ఆధారాల ను ఎందుకు బయటపెట్టడంలేదు? అందుకే పోసాని కృష్ణమురళిపై పరువునష్టం దావా వేశాను. నాపై చేసిన నిరాధార ఆరోపణలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, రూ.5కోట్ల నష్టపరిహారం చెల్లించాలని దావాలో పేర్కొన్నాను. గతంలో సాక్షిమీడియాపై కూడా నేను పరువునష్టం దావా వేశాను. ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేసేవారు ఎవరైనా సరే .. వారిని వదిలిపెట్టను.
విలేకరుల ప్రశ్నలకు లోకేశ్ స్పందన.. లోకేశ్ అంటే జగన్ కు భయం. గతంలో నేను అమెరికాలో చదివినప్పుడు కూడా నా చదువుకు సంబంధించిన ఫీజులు ఎవరో కట్టారని దుష్ప్రచారం చేయించాడు. కష్టపడి చదివింది కూడా ఎవరో చదివించారని చెప్పే దుస్థితికి వచ్చారు. కానీ నా చదువుకు అయిన ఖర్చులు, వాటికి సంబంధించిన రసీదుల్ని చంద్రబాబు గారు అసెంబ్లీసాక్షిగా బయటపెట్టారు. అప్పుడు నేను రాజకీయాల్లోకి రాకూడదని అలా విషప్రచారం చేశారు. వచ్చాక కూడా అదే కొనసాగిస్తున్నారు. వైసీపీ కుక్కల్ని ఎలా కట్టడిచేయాలో నాకుబాగా తెలుసు.
యువగళం పాదయాత్రకు ముందున్న లోకేశ్.. ఇప్పడున్న లోకేశ్ వేరు… యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పటి లోకేశ్ కు, ఇప్పటి లోకేశ్ కు చాలా తేడా వచ్చింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏంచేయాలనే దానిపై స్పష్టత వచ్చింది. కర్నూలు పార్లమెంట్లోని ప్రజా సమస్యలు.. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ప్రజల సమస్యలపై అవగాహన వచ్చింది. గుంటూరు, ప్రకా శం జిల్లాల్లోని ప్రజల సమస్యలు గ్రహించాను. అధికారంలోకి వచ్చాక యువగళం లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాను.
గిట్టనివారిని వేధించడం.. దాడులు చేయడమే సైకో లక్షణం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు స్పందించినా వారిపై దాడులు చేస్తున్నారు. మార్గదర్శి సంస్థ స్థాపించి 62 ఏళ్లు. ఏనాడూ ఏ ఒక్క డిపాజిట్ దారుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈనాడు సంస్థ తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందన్న అక్కసుతోనే మార్గదర్శిపై దాడులు చేయిస్తున్నారు. ఆ ఒక్క సంస్థే కాదు… అనేక మీడియా సంస్థలపై, విలేకరులపై కూడా దాడులు చేసి వేధిస్తున్నారు కదా ! ఇదివరకే చెప్పాను జగన్ రెడ్డి ఒక సైకో అని.
సైకో మనస్తత్వం ఏమిటంటే ఎవరైతే తనకు గిట్టరో వారిని వేధించి ఆనందిస్తాడు. సొంతతల్లి, చెల్లిని మెడపట్టి గెంటేశాడు. బాబాయ్ ని చంపించి, ఆ నేరాన్ని ఇతరులపైకి నెట్టి ఎన్నికల్లో గెలి చాడు. పరిశ్రమల్ని తన్ని తరిమేస్తున్నాడు. యువత ఉద్యోగ, ఉపాధిలేక మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
10ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు ఇదిచేశానని చెప్పగల ధైర్యం కరకట్ట కమల హాసన్ కి ఉందా?
ప్రతిపక్షంలో ఉన్నా మంగళగిరి ప్రజలకోసం సొంతడబ్బుతో 27పథకాలు పెట్టాను. కరకట్ట కమలహాసన్ ని సూటిగా ఒక్కటే ప్రశ్నిస్తున్నా. ఎన్నికలకు ముందు కొండ, వాగు పోరంబోకు భూములు, ఇతర భూముల్ని రెగ్యులరైజ్ చేయించి, ప్రజలకు పట్టాలిప్పిస్తానని చెప్పాడు. ఆ హామీ ఏమైంది? ఇక్కడినుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న మెయిన్ రోడ్డుపై బహిరంగసభ పెట్టి అమరావతి ఎక్కడికీ పోదన్నాడు. అదే వ్యక్తి అసెంబ్లీలో మూడురాజధానుల బిల్లు పెట్టినప్పుడు అను కూలంగా ఎందుకు ఓటేశాడు?
నేను ఓడిపోయినా ఇక్కడే ఆయనకంటే ఎక్కువ గా ప్రజల్లో ఉన్నాను. మంగళగిరి ప్రజలకోసం నా సొంత డబ్బుతో 27పథకాలు అమలు చేస్తున్నాను. నా నియోజకవర్గ ప్రజలపై నాకున్న అభిమానం అలాంటిది. రామకృష్ణారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరిలో అభివృద్ధికి అడ్డుపడ్డా డు. ఇప్పుడు నేను చేస్తున్నది తప్పు అంటున్నాడు. పాదయాత్రలో ఉన్నా.. నా మనసంతా మంగళగిరిలోనే ఉంటుంది.
మంగళగిరి నియోజకవర్గంలోకి వచ్చాక నేను చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పి, ప్రజలతో సెల్ఫీలు దిగాను. అలానే తాను చేసింది చెప్పుకొని సెల్ఫీలు దిగే ధైర్యం రామకృష్ణారెడ్డికి ఉందా అని సవాల్ చేస్తున్నా. మంగళగిరిలో ఇది చేశామని ప్రభుత్వమైనా చెప్పవచ్చు. 2024లో మంగళగిరిలోనే పోటీచేస్తా.. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీ తో గెలుస్తా. 9నెలలు ఆగితే కరకట్ట కమలహాసన్ ని ఇక్కడి ప్రజలే ఇంటికి పంపి స్తారు. ఎమ్మెల్యేగా 10ఏళ్లుగా ఇచ్చినహామీలను నెరవేర్చలేదని ప్రజలే నాతో మొరపెట్టుకున్నారు. నేను మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలతో ఒక శిలాఫల కం వేస్తున్నాను. అధికారంలోకి రాగానే అన్నింటినీ నెరవేరుస్తాను.
ప్రజల కోసం పోరాడే మాపై ఆంక్షలా… థర్డ్ గ్రేడ్ సినిమాలు తీసేవాళ్లకు అనుమతులా? కొందరు అధికారుల వల్ల వ్యవస్థలకే చెడ్డపేరు వస్తోంది. యువగళం పాదయాత్ర లో ఇబ్బంది పెట్టింది రిషాంత్ రెడ్డే. విజయవాడ అయినా, మరోచోట అయినా శాంతియుత ర్యాలీ చేయడానికి మాకు ఎలాంటి అనుమతులు అవసరంలేదు. రాజ్యాంగం ప్రకారమే మేం వ్యవహరిస్తున్నాం. నేను వెళ్లేదారిలో మమల్ని రెచ్చగొ ట్టేలా, మా నాయకుడిని కించపరిచేలా ప్లెక్సీలు కడితే మేం ఎలా ఊరుకుంటాం? వాళ్ల నాయకుడు..వాళ్ల ప్రభుత్వం చేసింది చెప్పుకోమనండి. మాకేం ఇబ్బంది లేదు.
మేం ఎక్కడా ఎప్పుడూ శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ప్రవర్తించలే దు. వైసీపీ కార్యాలయాల ముందు నుంచే నడుస్తూ వచ్చాను. కేవలం లోకేశ్ ను ఇబ్బంది పెట్టడానికే ఆంక్షలు అంటున్నారు. థర్డ్ గ్రేడ్ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మకు అనుమతి ఇస్తారు.. ప్రజలకోసం పోరాడే మాపై మాత్రం ఆంక్షలా? ముఖ్యమంత్రి బయటకువస్తే దుకాణాలు మూసేసి, ప్రజల్ని ఇబ్బంది పెడుతారు.. మేం నడిస్తే మాత్రం ఆంక్షలా? లోకేశ్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే నమ్ముకున్నాడు.
మెడికల్ సీట్ల అమ్మకానికి సంబంధించిన జీవోల్ని రద్దుచేస్తాం.. మెడికల్ కళాశాలలకు సంబంధించి అడ్డగోలుగా ఈప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తాలూకా జీవోలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తుంది. ప్రభుత్వం మెడికల్ కళాశాలల్లో సీట్లు అమ్ముకోవడమేం టి? రాత్రిపూట ఆత్మలతో మాట్లాడి, తెల్లారాక జీవోలు ఇస్తే ఇలానే ఉంటుంది. ప్రజల ఇబ్బందులు.. సమస్యలు పట్టని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమేనా?
ఎప్పుడూ చంద్రబాబే ముఖ్యమంత్రి…. తప్పుడు వార్తలురాసినా.. దుష్ప్రచారం చేసినా ఎక్కడ లోకేశ్ తమ చీటి చింపు తాడో అని వైసీపీనేతలు, వారి తొత్తులుగా పనిచేసే మీడియా భయపడుతోంది. 2024 నుంచి 2029 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారు. తర్వాత కూడా ఎప్పుడూ ప్రజల ఆశీర్వాదంతో ఆయనే ముఖ్యమంత్రి అవుతారు.
కులం..మతం..ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ రెడ్డి లక్ష్యం. దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే పరమవేస్ట్ ముఖ్యమంత్రి ఈయనే.
మంగళగిరి నియోజకవర్గమైనా, మరోటైనా ఎక్కడ పెట్టుబడులు పెడితే, అక్కడి యువతకే ఉపాధికల్పనలో తొలిప్రాధాన్యత ఇస్తాం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే మా ప్రధాన లక్ష్యం. నిరుద్యోగుల్ని కులం..మతమని విభజించడం వైసీపీ కే చెల్లింది. కులప్రస్తావన వల్లే రాష్ట్రం ఇప్పుడు 30ఏళ్లు వెనక్కు వెళ్లింది. కియా పరిశ్రమ ఏర్పాటు చేసింది బీసీ నియోజకవర్గంలో. కావాలనే ఈ దుర్మార్గులు కులం, మతం, ప్రాంతం అంటూ ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
ప్రభుత్వ సలహాదారుల్లో ఇతరకులాలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? టీడీపీ హాయాంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం. కులాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఎప్పుడూ పనిచేయలేదు. రాజధాని అమరావతి మొత్తం రిజర్వడ్ నియో జకవర్గాల పరిధిలోనే ఉంది. ఎస్సీ ఎస్టీలు… బీసీలు.. మైనారిటీలు ఎవరి గురించై నా బహిరంగంగా వారిమధ్య చర్చించే దమ్ము, ధైర్యం ఈప్రభుత్వానికి ఉందా? 5 వేల రూపాయల ఉద్యోగాలు కాకుండా ఈ నాలుగున్నరేళ్లలో నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పమనండి.
మేం తీసుకొచ్చిన పరిశ్ర మలు పక్కరాష్ట్రాలకు పోతుంటే బాధగా ఉంది. అడ్డగోలుగా దోపిడీచేస్తున్న ఈ ముఖ్యమంత్రికి వచ్చిన నష్టమేం లేదు. అధికారంలో ఉంటాడు..దోచుకుంటాడు.. రేపు ప్రజలు ఛీకొడితే కనిపించకుండా పోతాడు. కులం.. మతం..ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ రెడ్డి లక్ష్యం. అతనికి సిగ్గులేదు.. అతని చుట్టూ ఉండే మంత్రులు, సీనియర్ నేతలకు అయినా మతి ఉండాలిగా? ఎలా ఉండాల్సిన రాష్ట్రాన్ని… ఎలా మార్చాడని తలుచుకుంటే యువకుడిగా చా లా బాధ వేస్తోంది.
నాలుగేళ్ల మూడునెలల్లో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తీసుకొచ్చా రా? కోడిగుడ్డు మంత్రికి సిగ్గుందా? పక్కరాష్ట్రాలకు వెళ్లి, తాను ముఖ్యమంత్రినని చెప్పుకునే ధైర్యం జగన్ రెడ్డికి లేదు. దేశంలోని ముఖ్యమంత్రులందరి కంటే ఈయన పరమ వేస్ట్. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మాత్రమే కుల రాజకీ యాలు కావాలి.” అని లోకేశ్ తేల్చిచెప్పారు…!!