– నోటిఫికేషన్ తర్వాతే ఎస్పీ, కలెక్టర్ల బదిలీలు?
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు తుదిదశకు చేరుకుంది. ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు సీఎం.గంటన్నర పాటు అభ్యంతరాలపై సమీక్ష జరిపారు.
పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే అభ్యంతరాలను పరిశీలించి మార్చి 31 తేదీన కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం కసరత్తు కూడా తుది అంకానికి చేరుకుంది.
ఏపీ ప్రభుత్వం 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినసంగతి తెలిసిందే. జిల్లాల పేర్లు, రెవెన్యూ డివిజన్ల మార్పు మొదలైన అభ్యంతరాలను పరిశీలించి ఈనెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ లోపే భారీగా ఉద్యోగ బదిలీలకు కసరత్తు ప్రారంభించారు. నోటిఫికేషన్ తరువాత కలెక్టర్లు, ఎస్పీలు, జేసీల ట్రాన్స్ఫర్ జరగనున్నాయి.