విశ్వగురుత్వం తర్వాత… ముందు మన జెండాలు దేశీయంగా తయారు చేయండి

151

– చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందని కేటీఆర్ ఎద్దేవా

స్వదేశంలో జాతీయ జెండాలు తయారు చేసే పరిస్థితుల్లో ఖాదీ పరిశ్రమ లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్… మేకిన్ ఇండియా అంటున్న బీజేపీ సర్కార్‌.. కనీసం జాతీయ జెండాలను దేశంలో తయారు చేసే పరిస్థితులను సృష్టించలేకపోయిందని విమర్శించారు. వాటిని సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. విశ్వ గురువుగా డాంబికాలు ప్రదర్శించే కేంద్రం… 75వ భారత దేశ స్వాతంత్ర్య సంబరాలు చేస్తామని ముందే తెలిసినా, కనీసం జాతీయ జెండాలను దేశంలో తయారు చేయించాలనే ప్రణాళిక లేని పరిస్థితుల్లో కేంద్రం ఉందన్నారు. ఆత్మ నిర్భర భారత్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.ktr-tweet