Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల మనిషి నల్లమిల్లి మూలారెడ్డి

-టీడీపీ కేంద్ర కార్యాలయంలో మూలారెడ్డికి నేతల నివాళి

ప్రజల మనిషి నల్లమిల్లి మూలారెడ్డి అని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని టీడీపీ నేతలన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత నల్లమిల్లి మూలారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సంధర్బంగా నేతలు ఆయన చిత్రపటానికి పూలమాళ వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ….

మూలా రెడ్డి ప్రజల మద్దతుతో సర్పంచ్ నుంచి శాననసభ్యునిగా ఎదిగారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు ఆదరించటం ఆయన చేసిన ప్రజాసేవకు, ప్రజలకు తనపట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతోంది. ఎమ్మెల్యేగా మూలారెడ్డి అనపర్తి నియోజకవర్గ అభివృద్దిపై చెరగని ముద్ర వేశారు. మూలారెడ్డి పార్టీ అభ్యున్నతికి, కార్యకర్తల పురోభివృద్ధికి చేసిన సేవలు అజరామరం.

మూలారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని టీడీపీ నేతలన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాస్, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, బుచ్చి రాంప్రసాద్, తెలుగు రైతు సాంభిరెడ్డి, మునిరత్నం నాయుడు, గోళ్ల ప్రభాకర్, పొదిలి రమేష్, కుమార్, పరిటాల సునీల్, భానుతేజ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE