Suryaa.co.in

Telangana

పద్మారావు కార్యాలయంలో పతాకావిష్కరణ

సితాఫలమండీ లోని సికింద్రాబాద్ నియోజకవర్గ ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో గౌరవ ఉప సభాపతి పద్మారావు గౌడ్ సోమవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ గార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుమారి సామల హేమ, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ ల తో పాటు పెద్ద సంఖ్యలో తెరాస నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

అర్హులైన లబ్దిదారులకు ఆసరా పించన్లు:
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్హులైన లబ్దిదారులకు ఆసరా పించన్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. స్వాతంత్ర స్వర్ణోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ని కొత్త లబ్దిదారులకు ఆసరా పించన్ల మంజూరు పత్రాలను, గుర్తింపు కార్డులను ఉప సభాపతి పద్మారావు గౌడ్ సోమవారం అందచేశారు. సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఏ12A0887ఆసరా లేని వారికి ప్రభుత్వమే బాసటగా నిలుస్తోందని తెలిపారు. డయాలసిస్ రోగులకు సైతం ఆసరా పించన్లు మంజూరు చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారి చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకొని సికింద్రాబాద్ పరిధిలో ఎక్కువ మందికి లబ్ది చేకుర్చమని తెలిపారు. ప్రస్తుతం వరకు సికింద్రాబాద్ పరిధిలో 15,444 మందికి పించన్లు లబిద్స్తున్నాయని, ఏటా రూ.40 కోట్లకు పైగా నిధులను వినియోగిస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ, రాసురి సునీత తాసిల్దార్ మాధవి, తెరాస యువ నేత తీగుల్ల కిషోర్ కుమార్త పాల్గొన్నారు. 47 మందికి కొత్త ఆసరా పించన్ల మంజూరు పత్రాలను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అందచేశారు.

LEAVE A RESPONSE